షార్ట్‌సర్క్యూట్‌తో రూ.10లక్షల సామగ్రి దగ్ధం
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:25 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్‌రోడ్డులోని మ్యాట్రిక్ ఎలకా్ట్రనిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్ దుకాణం పైఅంతస్తు పెంట్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
మిర్యాలగూడలోని ఎలక్ర్టానిక్ దుకాణంలో ఘటన
మిర్యాలగూడ అర్బన, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్‌రోడ్డులోని మ్యాట్రిక్ ఎలకా్ట్రనిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్ దుకాణం పైఅంతస్తు పెంట్‌హౌజ్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో విక్రయాలకు సిద్ధంగా ఉన్న టీవీలు, ఫ్రీజ్‌లు, వాషింగ్ మిషన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ సామాగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో సుమారు రూ.10లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని మహ్మద్ మహబూబ్ తెలిపాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. విషయం తెలుసుకున్న ఇనచార్జి డీఎస్పీ రవికుమార్ వనటౌన, టూటౌన సీఐలు నాగభూషణంరావు, సోమనర్సయ్యలతో కలిసి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన సీఐ నాగభూషణం రావు తెలిపారు.