నిధులు సరే... ఉపయోగమేదీ?
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:57 PM
రైతుల కోసం నిర్మించిన గోదాములు నిరుపయోగం గా మారాయి. ధరలేని సమయంలో ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని, ధరలు ఉన్నప్పుడు విక్రయించే వెసులుబాటు ఉందనే విషయం రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మార్కెట్‌పాలకవర్గాలు ఉన్నా రైతులకు మేలు జరగడం లేదు.
రైతులకు ఉపయోగపడని గోదాములు
మరమ్మతులు, ఇతర అవసరాల పేరిట రూ.కోట్లు ఖర్చు
(ఆంధ్రజ్యోతి-భానుపురి) : రైతుల కోసం నిర్మించిన గోదాములు నిరుపయోగం గా మారాయి. ధరలేని సమయంలో ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకుని, ధరలు ఉన్నప్పుడు విక్రయించే వెసులుబాటు ఉందనే విషయం రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మార్కెట్‌పాలకవర్గాలు ఉన్నా రైతులకు మేలు జరగడం లేదు. అవసరంలేని చోట గోదాములు నిర్మించి, మరమ్మతులు చేయాలని ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు అయ్యేలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఉపయో గంలేకపోయినా కొత్త గోదాములకు, భవనాలకు, ప్రహరీలకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొంటున్నారు. సబ్‌మార్కెట్ యార్డులు కొన్నిచోట్ల నిర్మాణం చేసినా కొద్దోగొప్పో మాత్రమే రైతులకు ఉపయోగపడుతున్నా యి. కొన్నింటిని ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు తీసుకుని అద్దెలు ఇస్తున్నట్లు సమాచారం. అదేసమయంలో అద్దెచెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉ న్నాయి.దీంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి.
రూ.5 కోట్ల బకాయిలు
జిల్లాలో సుమారు 12గోదాముల వరకు పౌరసరఫరా లశాఖ,రెవెన్యూ శాఖలే వాడుకుంటున్నట్లు సమాచారం. వీరు చెల్లించాల్సిన అద్దె సుమారు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అద్దె బకాయిలపై జిల్లా స్థాయి అధికారులను అడిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలే వినియోగించుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారని మార్కెటింగ్ శాఖ చెబుతోంది.
నిధులు కేటాయింపు..
జిల్లాలో హుజూర్‌నగర్, సూర్యాపేట, నేరేడుచర్ల మార్కెట్‌లకు మార్కెటింగ్ శాఖకు ఇటీవల నిధులు మంజూరయ్యాయి. హుజూర్‌నగర్ మార్కెట్‌కు రూ.4 కోట్లు, సూర్యాపేట మార్కెట్‌కు రూ.3.50 కోట్లు, నేరేడుచర్ల మార్కెట్‌కు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. హుజూర్‌నగర్‌లో పరిధిలోని 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గ్వాలిమ్‌వామ్ షెడ్‌ను రూ.1.25 కోట్లతో, సెక్యూరిటీ గార్డ్ రూంను రూ.10లక్షలు, గోదాముల రిపేర్‌కు రూ.20లక్షలు, మఠంపల్లి సబ్‌యార్డులో సీసీకి రూ.92లక్షలు, గోదాముల మరమ్మతుకు రూ.40 లక్షలు, హుజూర్‌నగర్‌లో కాంపౌండ్ హాల్‌లో రూ.53లక్షలు, గోదాముల మరమ్మతులకు రూ.20 లక్షలు, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ.18 లక్షలు, గరిడేపల్లి సబ్‌యార్డులో ఎలక్ర్టిషన్ పనులకు రూ.5లక్షలు, మఠంపల్లి పెద్ద ఐమాక్స్ లైట్ కోసం రూ.4 లక్షలు కేటాయించారు. ఇక్కడ పనులను ప్రారంభించాల్సి ఉంది. సూర్యాపేట మార్కెట్‌లో రూ.2.50 కోట్లతో కవర్‌షెడ్ పనులను ప్రారంభించారు. పశువులసంతలో పశువుల ను ఎక్కించడానికి రూ.30లక్షలతో ర్యాంపులను నిర్మించా రు.మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.20 లక్షలు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని 100 దుకాణాల మరమ్మతులకు రూ.50లక్షలను కేటాయించారు. వీటి ప నులు ప్రారంభించాల్సి ఉంది.నేరేడుచర్ల వ్యవసాయ మా ర్కెట్‌లో రూ.60లక్షల నిధులను కేటాయించగా లైటింగ్, షెడ్డులు,సీసీరోడ్డు, గోదాముల మరమ్మతులను చేపట్టాల్సి ఉంది.
మూడు మార్కెట్లకు నిధులు : దామోదర్, సూర్యాపేట మార్కెటింగ్ శాఖ అధికారి
హుజూర్‌నగర్, సూర్యాపేట, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ల కు ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. కొన్నిచోట్ల పనులు ప్రారం భం కాగా, మరికొన్ని చోట్ల ప్రారంభించాల్సి ఉంది. కనీస వసతుల ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తున్నాం.