తక్కువ ధరకు బంగారం పేరుతో మోసం
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:51 PM
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యకి నుంచి రూ.5 లక్షలతో ఉడాయించిన ఉదంతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో చోటుచేసుకుంది. కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోదాడకు చెందిన వేముల రామకృష్ణ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తూ కుటుంబసభ్యులతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు.
కోదాడ రూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యకి నుంచి రూ.5 లక్షలతో ఉడాయించిన ఉదంతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో చోటుచేసుకుంది. కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోదాడకు చెందిన వేముల రామకృష్ణ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తూ కుటుంబసభ్యులతో స్థానికంగా నివాసం ఉంటున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన వకుళాభరణం సురే్‌షతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బయటి మార్కెట్‌లో తులం బంగారం రూ.లక్షన్నర వరకు పలుకుతోందని, తనకు తెలిసిన వ్యక్తి వద్ద పాత బంగారం ఉందని, తులం రూ.80వేల చొప్పున ఇస్తాడని చెప్పి రామకృష్ణ నమ్మించాడు. సురేష్ తన కుమార్తెల వివాహం కోసం 12తులాల బంగారం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం కోదాడలోని కొమరబండ కేఎల్‌ఆర్ కాలనీలో ఉంటున్న వేముల రామకృష్ణ ఇంటికి వచ్చాడు. మొదట సురే్‌షకు తులం మంచి బంగారం ఇచ్చిన రామకృష్ణ పరీక్షించుకోమని చెప్పాడు. దీంతో సురేష్ ఆ బంగారాన్ని స్వర్ణకారుల వద్ద పరీక్షించి నిజమైన బంగారంగా గుర్తించాడు. అనంతరం రూ.5 లక్షలు ఇస్తే బంగారం తెచ్చి ఇస్తానని సురేష్ వద్ద నగదు తీసుకుని రామకృష్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, సాయంత్రం వరకు రాకపోవడం, ఫోనస్విచ్ఛా్‌ఫ రావడంతో సురే్‌షకు అనుమానం వచ్చి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రామకృష్ణ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వేముల రామకృష్ణ కొమరబండ కేఎల్‌ఆర్ కాలనీలో నెలరోజుల కిందటే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.