Share News

వారానికి నలుగురు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:28 AM

రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలు పోతున్నాయి. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినా ఫలితాలు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో 590 ప్రమాదాలు జరగ్గా 209 మంది మృతి చెందారు.

వారానికి నలుగురు

ఈ ఏడాది 590 ప్రమాదాలు

209 మంది మృతి, 604 క్షతగాత్రులు

నివారణ చర్యలు చేపడుతున్నా ఆగని ప్రమాదాలు?

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలు పోతున్నాయి. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినా ఫలితాలు కనిపించడం లేదు. ఈ ఏడాదిలో 590 ప్రమాదాలు జరగ్గా 209 మంది మృతి చెందారు. 604 మంది క్షతగాత్రులయ్యారు. సరాసరి వారానికి 12 ప్రమాదాలు జరుగుతుండగా నలుగురు చొప్పున మృతి చెందుతున్నారు. 13 మంది క్షతగాత్రులుగా మిగులుతున్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగడంలేదు. ప్రమాదాలు జరగడం షరా మామూలుగా మారింది. ముఖ్యంగా చివ్వెం ల, సూర్యాపేట మండలంతో పాటు పట్ట ణం, మునగాల, కోదాడ, హుజూర్‌నగర్‌, అర్వపల్లి, నాగారం, గరిడేపల్లి, నేరేడేచర్ల, తిరుమలగిరి, మోతె మండలాల పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు సూర్యాపేట-ఖమ్మం, కోదాడ-జడ్చర్ల, సూర్యాపేట-జనగాం, సూర్యాపేట-దంతాలపల్లి ర హదారులలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లిన వారు ఇంటికి క్షేమంగా వస్తారనే నమ్మకం లేకుండాపోతోంది.

జిల్లాలో 43 బ్లాక్‌స్పాట్లు

జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. మొత్తం 43ప్రాంతాలు ఉండగా ఆయా చోట్ల ప్రమాదాల నివారణకు ఇటీవల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్‌రోడ్డు, వ్యవసాయమార్కెట్‌, దురాజ్‌పల్లి క్రాస్‌రోడ్డు, కట్టకొమ్మగూడెం క్రాస్‌రోడ్డు, ముకుందాపురం క్రాస్‌రోడ్డు, మొద్దులచెర్వు క్రాస్‌రోడ్డుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాతీ య రహదారుల సంస్థ చర్యలు చేపట్టింది. మొదటగా అండర్‌పాస్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు సర్వీస్‌ రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేస్తున్నారు. సరిపడా లైటింగ్‌ ఏర్పాటు, రోడ్డు క్రాసింగ్‌ల వద్ద వాహనాల వేగం తగ్గించేలా చ ర్యలు చేపట్టా రు. హైవేపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపకుండా హైవే పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు.

పెరుగుతోన్న ప్రమాదాలు

జిల్లాలోని జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులపై నిత్యం ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2024లో 622 రోడ్డు ప్రమాదాలు జర గ్గా 278 మంది మృతి చెందారు. 576 మంది క్షతగాత్రులయ్యారు. 2025 లో 563 రోడ్డు ప్రమాదాల్లో 204 మంది మృతి చెందగా, 507 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 590 ప్రమాదాలు జరగ్గా 209మంది మృతి చెందారు. 604 మంది గాయపడ్డారు. ఎక్కువగా బైక్‌ పమాదాల్లోనే 138మంది మృతి చెందారు. హెల్మెట్‌ ధరించకపోవడంతో మృతి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు.

కారణాలివే..

రోడ్డు ప్రమాదాలకు అతివేగం ప్రధానకారణం. అంతేకాక వాహనదారులు రాంగ్‌రూట్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, మద్యం తాగి నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. జాతీయరహదారిపై గ్రామాల వద్ద సర్వీస్‌ రోడ్లు నిర్మించలేదు. దీంతో వాహనదారులు కొంతదూరం సర్వీస్‌ రోడ్డు వరకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. దూరం వెళ్లలేక రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఫ హైవేలపై పశువుల రాక కూడా ప్రమాద కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. డివైడర్లపై గడ్డిని మేస్తూ ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కోదాడ మండలంలో ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో 8మంది మృతి చెందారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామస్టేజీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వారిని డీసీఎం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.

ఫ రెండేళ్ల కిందట సూర్యాపేటలోని అంజనాపురి కాలనీ క్రాస్‌రోడ్డు వద్ద లారీని ఆటో ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

కలెక్టర్‌, ఎస్పీ ప్రత్యేక దృష్టి

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌పవార్‌, ఎస్పీ కొత్తపల్లి నర్సింహ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్డు భద్రతపై డ్రైవర్లకు, విద్యాసంస్థల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణసమయంలో విఽధిగా పాటించాల్సిన వాటిని వివరిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఆదేశిస్తున్నారు.

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో విలేజ్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీలు

రోడ్డు ప్రమాదాలను నివారణకు, ప్రమాదాల సమయంలో సహాయక చర్యలు అందించేందుకు ఎస్పీ కొత్తపల్లి నర్సింహ విలేజ్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ఏడుగురు సభ్యులను నియమించారు. వీరిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు కూడా కమిటీలో ఉన్నారు. ప్రధానరహదారుల్లో ఇప్పటికే గుర్తించిన బ్లాక్‌స్పాట్స్‌ సమీపంలో గ్రామాల ప్రజలను ఆయా కమిటీల్లో బాగస్వాములను చేస్తున్నారు. గాలిమిషన్‌, హోటల్‌ నిర్వాహకులు, రోడ్డు సమీప గ్రామాల్లో స్వచ్ఛందంగా సమాజసేవకు పాటుపడే వారిని గుర్తించి కమిటీలో భాగస్వామ్యం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : కొత్తపల్లి నర్సింహ, ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు నివారణకు చర్యలు చేపట్టాం. డ్రైవర్ల అజాగ్రత్తతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్నాం. నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లలో రక్షణ చర్యలు చేపట్టాం. కొత్తగా విలేజ్‌ రోడ్‌ సేప్టీ కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీల ద్వారా ప్రమాదాలకు నివారణ చర్యలు చేపడుతున్నాం. సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే వారి సేవలను క్షతగాత్రుల కోసం వినియోగిస్తున్నాం.

Updated Date - Nov 19 , 2026 | 12:28 AM