ఎఫ్‌ఎంజీల సమ్మెబాట
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:11 AM
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ)సమ్మెబా టపట్టారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాలల బోధనాసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్న మెడికోలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేశారు.
ఐఎంజీలతో సమానంగా ఉపకార వేతనం ఇవ్వాలి
భువనగిరిటౌన్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ)సమ్మెబా టపట్టారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసి స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాలల బోధనాసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తున్న మెడికోలు తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈమేరకు జిల్లాకేంద్ర ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఎఫ్‌ఎంజీ మెడికోలు సోమవారం ఓపీ సేవ లు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యా లీ నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నాలుగేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం తో ఉద్యమాన్ని తీవ్రతరం చేశామని, ఈ నెల 14న హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఎఫ్‌ఎంజీ ప్రతినిధులు తెలిపారు.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు..
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెడికోలను ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్‌ఎంజీ)గా పరిగణిస్తారు. స్వదేశంలో నాలుగేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యవిద్యార్థులు అదే కళాశాలలో ఏడాదిపా టు ఇంటర్న్‌షిప్ పూర్తిచేస్తారు.నిబంధనల ప్రకారం ఏడాదిపాటు నెలకు రూ.29, 792 ఉపకార వేతనంగా లభిస్తుంది. కానీ విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు మాత్రం నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ)ఆధ్వర్యంలో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బిఎంఎ్‌స) నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఎఫ్‌ఎంజీఈ ఫలితాల ఆధారంగా కౌన్సిలింగ్ విధానంలో కేటాయించే బోధనాసుపత్రులలో రెండేళ్లపాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఎఫ్‌ఎంజీ కఠినంగా ఉంటుండడంతో ఏటా ఉత్తీర్ణత శాతం 10 నుంచి 12లోపే ఉంటున్నట్లు రికార్డులు పేర్కొంటున్నాయి.
డిమాండ్లు ఇవీ..
ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఐఎంజీఎ్‌సతో సమానంగా నెలవారీగా రూ.29,792 ఉపకార వేతనం ఇవ్వాలి. 2026 జనవరి నుంచి బకాయిపడిన ఉపకార వేతనం వెంటనే చెల్లించాలి. వేధింపులు, ప్రతీకారచర్యలు మానుకోవాలి. అదనపు పని గంటల విధానాన్ని రద్దు చేయాలి. క్రమశిక్షణ ఉల్లంఘన పేరిట ఇంటర్న్‌షిప్ పొడిగింపును మానుకోవాలి. ఎఫ్‌ఎంజీఈని సులభతరం చేయాలి. అలాగే నిబంధనల ప్రకారం స్టైఫండ్ రాకపోతుండడంతో వైద్య విద్య కోసం తీసుకున్న బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించలేక ఆర్థిక భారానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మెబాట
సమస్యల పరిష్కారానికి మూడు దశల ఉద్యమానికి ఎఫ్‌ఎంజీ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి 10 వరకు ఎమర్జెన్సీ సేవలను నిర్వహిస్తూ ఓపీ సేవల బహిష్కరణ, 11నుంచి 13 వరకు పాక్షిక సమ్మె, 14 నుంచి 16 వరకు అన్ని సేవల బహిష్కరణ, 14న హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఈఎంఈ కార్యాలయ ముట్టడి చేపట్టనున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే పూర్తిస్థాయి విధుల బహిష్కరణ ఉంటుంది. ఈ మేరకు భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట బోధనాసుపత్రిలోని ఎఫ్‌ఎంజీలు సమ్మెబాట పట్టడంతో వైద్య సేవలకు తాత్కాలిక అంతరాయం కలుగుతోందని ఆసుపత్రి అధికారులు పేర్కొంటున్నారు. కాగా భువనగిరి బోధనాసుపత్రిలో నిర్వహించిన సమ్మెలో ఎఫ్‌ఎంజీలు గంజి భానుప్రసాద్, ప్రణీత్‌రాహుల్, నవీన్‌కుమార్, జయంత్, మేఘన, సూర్యకిరణ్, ఐశ్వర్య, సాయిశ్రీజ, భవిత, శ్వేత, జావీద్ పాల్గొన్నారు.