Share News

ఎట్టకేలకు రైతులకు తీపి కబురు

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:36 AM

రాష్ట్ర ప్రభు త్వం ఎట్టకేలకు రైతుభరో సా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్‌ ప్రారంభమై మూడు నెల లు దాటడంతో పాటు సీజన్‌ పూర్తి కావొస్తున్నా, ప్ర భుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎట్టకేలకు రైతులకు తీపి కబురు

మూడు విడతల్లో ‘రైతు భరోసా’

ఈ నెల 22న తొలివిడత పెట్టుబడి సాయం

ఏప్రిల్‌ నెలాఖరులోగా భరోసా ప్రక్రియ పూర్తి

పెట్టుబడి జమకు ప్రభుత్వం ఏర్పాట్లు

నల్లగొండ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ఎట్టకేలకు రైతుభరో సా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యాసంగి సీజన్‌ ప్రారంభమై మూడు నెల లు దాటడంతో పాటు సీజన్‌ పూర్తి కావొస్తున్నా, ప్ర భుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా, ప్రభుత్వం ఆదివారం ఉమ్మడి జిల్లా రైతాంగానికి తీపి కబురు చెప్పింది. మొదటి విడత రైతు భరోసాను సిద్ధిపేట జిల్లాలో ఈ నెల 22వ తేదీన ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ఏక కాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు ఎకరం వరకు పెట్టుబడి సాయాన్ని అందజేయనుంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21.50లక్షల ఎకరాలు

రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందజేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సాగులో ఉన్నా, లేకున్నా రైతులకు పాస్‌బుక్‌ ఉంటే ప్రతీ ఎకరాకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21.50లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, మొత్తం సుమారు 10.50లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈనెల 22న మొదటి విడత రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున జమకానుంది. కేంద్ర ప్రభుత్వం ఈనెల 13వ తేదీన ప్రతీ రైతుకు రూ.2వేల చొప్పున రైతుల ఖాతాలో పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మూడు విడతల్లో పెట్టుబడి సాయాన్ని ఇవ్వనుంది.

Updated Date - Mar 16 , 2026 | 12:36 AM