tiger {భయం.. భయం..
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:06 AM
జిల్లాలో 10 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి కదలికలు అటవీ అధికారులకు అం తు చిక్కడం లేదు. దీంతో పెద్దపులి భయం ప్రజలను వీడటం లేదు. ఈ నెల 24 నుంచి యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సంచరించినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు.
10 రోజులుగా దొరకని పెద్దపులి జాడ
తాజాగా దత్తాయపల్లిలో లేగదూడపై దాడి
కనిపించకుండాపోయిన ఆవు, లేగదూడ
జాడ తెలుసుకునేందుకు ఎన్‌టీసీఏ ఆధ్వర్యంలో శిక్షణ
(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి/ భువనగిరి రూరల్): జిల్లాలో 10 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి కదలికలు అటవీ అధికారులకు అం తు చిక్కడం లేదు. దీంతో పెద్దపులి భయం ప్రజలను వీడటం లేదు. ఈ నెల 24 నుంచి యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సంచరించినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. శనివారం రాత్రి రాళ్లజనగాంలో లేగదూడను చంపగా, తాజాగా సోమవా రం మధ్యాహ్నం దత్తాయపల్లి గ్రామంలోని వ్యవసా య బావి వద్ద ఓ లేగదూడను చంపినట్లు గుర్తించా రు. దీనికి తోడు ఆవు, మరో లేక కనిపించకుండా పోయిందని రైతు చెబుతుండటంతో భయాందోళ న మొదలైంది. ఇదిలా ఉండగా స్థానిక అధికారులకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ( ఆధ్వర్యంలో పులిని గుర్తించడంపై అవగాహన కల్పించారు.
పెద్దపులి సంచారంతో రైతులు, ప్రజలకు నిద్రపట్టడం లేదు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చీకటిపడిందంటే ఊరికే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ నెల 24న యాదగిరిగుట్ట పరిసర గ్రామాల్లో సంచరించగా, రాళ్లజనగాంలో లేగదూడను చంపినట్లు అటవీఅధికారులు పరిశీలించి నిర్ధారించారు. అయితే భువనగిరి మండలం బీఎన్‌తిమ్మాపూర్‌లో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద పెద్దపులి పాద ముద్రలు ఉన్నట్లు ప్రచారం కొనసాగడంతో తుర్కపల్లి మండల ప్రజలు ఊపిరిపీల్చుకోగా, భువనగిరి మండల రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే తాజాగా సోమవా రం మధ్యాహ్నం దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు గొట్టె శ్రీశైలం వ్యవసాయ బావి సమీపంలో పెద్దపులి దాడిలో ఓ లేగదూడ చనిపోయినట్లు గుర్తించారు. అంతేకాకుం డా మరో ఆవు, మరో లేగ కనిపించకుం డా పోయినట్లు రైతు తెలిపాడు. తనకున్న ఎనిమిది ఆవులు, తొమ్మిది లేగదూడలు ఉండగా, ఉదయం 8 గంటలకు రైతు పాలు తాగే నాలుగు లేగ దూడలను తన పశువుల పాకలో కట్టేశాడు. రోజు మాదిరిగానే మిగతా వాటిని మేత కోసం వ్యవసాయ బావి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. సాయంత్రం కాగానే తామంతట అవే తిరిగి బావి దగ్గర ఉన్న దొడ్డి దగ్గరకు వస్తాయి. సాయంత్రమైనా రాకపోతే ఆ రైతు వెళ్లి వాటిని పశువుల కొట్టం వద్దకు కొట్టుకువస్తాడు. సాయంత్రం నాలుగు గంట ల సమయంలో పశువులను కొట్టం వద్దకు శ్రీశైలం కుమారు డు తరుణ్ వెళ్లాడు. అప్పటికే ఒక లేగ దూడ చనిపోయి ఉండటంతో కుటుంబసభ్యులకు, అటవీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటనా స్థలానికి జిల్లా అటవీశాఖ భువనగిరి రేంజ్ ఆఫీసర్ రమే్‌షనాయక్ తన సిబ్బంది తో వెళ్లి వివరాలను సేకరించారు. కాగా రైతు శ్రీశైలానికి చెందిన 8 ఆవులలో ఒక ఆవు, నాలుగు లేగ దూడలలో ఒకటి మృతి చెందగా మరో లేగ దూడ అడవిలో దొరకలేదు. ఈ రెండు ఆదివారం సాయంత్రం నుంచే కనిపించడంలేదని రైతు తెలిపాడు. అదేసమయలో దత్తాయిపల్లి సమీపంలో పెద్దపులి కదలికలను గుర్తించడంతో తుర్కపల్లి, కోనాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ తదితర గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. లేగదూడను పెద్దపులి చంపిన ప్రదేశంలో అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేసి పులి జాడ కోసం గస్తీ నిర్వహిస్తున్నట్టు సెక్షన్ ఆఫీసర్ శాలిని తెలిపారు. రైతులెవరూ పెద్ద లేగ దూడను చంపిన ప్రదేశంలోకి వెళ్లవద్దని తెలిపారు.
ఎన్‌టీసీఏ ఆధ్వర్యంలో పరిశీలన
పెద్దపులి కదలికలను ఆలిండియా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) సమక్షంలో అటవీశాఖ అధికారులు సోమవారం భువనగిరి రేంజ్ ఆఫీసర్ రమే్‌షనాయక్ ఆధ్వర్యంలో...
అటవీ ప్రదేశాల్లో పరిశీలించారు. భువనగిరి అటవీశాఖ కార్యాలయంలో వైటీడీఏ, భువనగిరికి చెందిన అటవీశాఖ అధికారులకు భువనగిరి రేంజ్ ఆఫీసర్ రమే్‌షనాయక్ ఆధ్వర్యంలో ఎన్‌టీసీఏ శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పులి పాదముద్రలను ఎలా గుర్తించాలి, పులి ఏదైనా జంతువుపై దాడి చేసిన తర్వాత అది ఎటువైపు వెళ్తుందో అనే దానిపై అవగాహన కల్పించారు. దాడి చేసిన తర్వాత కొంతదూరం వెళ్లి మళ్లి వస్తుందని వివరించారు. మనుషుల కదలికలు ఉన్న ప్రదేశంలోకి పులి రాదని, పులి ఎక్కడైతే దాడి చేస్తుందో ఆ ప్రదేశానికి 50 మీటర్ల దూరం ఎవరినీ రానివ్వద్దని తెలిపారు. రాజాపేట మండలంలో భేగంపేటలో దొరికిన వెంట్రుకలు, తుర్కపల్లి, రాళ్ల జనగాం ప్రాంతంలో దొరికిన స్కాటు(మలం) పులివేనని శాస్తవేత్తలు తెలిపారు. అటవీలోకి ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దని, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్లాలని అధికారులు వివరించారు. జంట ఆడపులి కోసం మగపెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పెద్దపులి కోసం డ్రోన్ కెమెరాలు
భువనగిరి రూరల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : పెద్దపులి ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు భువనగిరి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రమే్‌షనాయక్ అన్నారు. ఆదివారం రాత్రి పెద్దపులి సంచరించినట్లు సోమవారం సోషల్‌మీడియాలో పేర్కొన్న భువనగిరి మండలం బీయన్‌తిమ్మాపూర్ శివారు ప్రాంతాన్ని గ్రామస్థులతో కలిసి అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రమే్‌షనాయక్ మాట్లాడుతూ 10 రోజుల నుంచి జిల్లాలోని రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ రాత్రి వేళ దట్టమైన చెట్ల పొదల్లో ఆవాసం పొందుతోందన్నారు. అయితే తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో లేగదూడపై దాడి చేసిందన్నారు. బీఎన్‌తిమ్మాపూర్‌లో పెద్దపులి సంచరించలేదని, అసత్యపు పోస్టులు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లవద్దన్నారు. కార్యక్రమంలో తుర్కపల్లి సెక్షన్ ఫారెస్టు ఆఫీసర్ జాహిద్ ఉస్సేన్, బీయన్‌తిమ్మాపూర్ సర్పంచ్ ఎడ్ల వెంకట్‌రెడ్డి, గ్రామస్థులు మోర నర్సిరెడ్డి, వల్లందాసు పరమేశ్, జగదీశ్వర్ ఉన్నారు.