రైతులు నాణ్యమైన విత్తనాలు వినియోగించాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:45 PM
రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించుకుని, అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వెంకటరమణారెడ్డి అన్నారు.
భువనగిరి రూరల్, జూన 23 (ఆంధ్రజ్యోతి): రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించుకుని, అధిక దిగుబడి సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పి.వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి శివారులోని రైతు వేదికలో రైతులకు నాణ్యమైన సన్న రకం వరి విత్తనాలు, కందులు, పెసర్లు, సజ్జలు, జొన్నలు, విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ల, పీఏసీఎస్ కేంద్రాలతో పాటు రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తనాల విక్రయ దుకాణాల్లోనే కొనుగోలు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవో డి.మల్లేష్, ఏఈవో కె.అనిల్ పాల్గొన్నారు.