Share News

దళారుల చేతిలో మోసపోతున్న రైతులు

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:03 AM

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని సర్పంచల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జక్క రాఘవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

దళారుల చేతిలో మోసపోతున్న రైతులు
భూదానపోచంపల్లిలో ధర్నా నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

భువనగిరి రూరల్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను సకాలంలో ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని సర్పంచల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జక్క రాఘవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండలంలోనినాగిరెడ్డిపల్లి, అనాజీపురం, నందనం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. 20 రోజుల నుంచి రైతులు కల్లాలో పడిగాపులు కాస్తున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికే రైతులు ధాన్యం సాగు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా ఇప్పటి వరకు విక్రయాలు జరపకపోవడం కాంగ్రెస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. రైతులు ధాన్యం దళారులకు అమ్మి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోళ్లు చేపట్టి రైస్‌ మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేశ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగాం పాండు, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ కస్తూరి పాం డు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన బల్గూరి మధుసూదన రెడ్డి, నాయకులు గోద శ్రీనివాస్‌ గౌడ్‌, నాగెల్లి రమేశ, మట్ట ధనుంజయ్య, రాసాల మల్లేశ, బాత్క అశోక్‌, మహేష్‌, విఠల్‌రెడ్డి, బాలకృష్ణగౌడ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

భూదానపోచంపల్లి: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాల్లో పోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఈమేరకు గురువారం భూదానపోచంపల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా, రాస్తారోకో తోపాటు సీఎం రేవంతరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని అన్నారు. రైతులను మోసగిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ పాక వెంకటే్‌షయాదవ్‌, నాయకులు కందాల భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, బాత్క లింగస్వామియాదవ్‌, పెద్దల చక్రపాణి, బీఆర్‌ఎస్‌ నాయకులు సామ రవీందర్‌రెడ్డి, నోముల మాధవరెడ్డి, పగిల్ల రాంరెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్‌, గునిగంటి మల్లే్‌షగౌడ్‌ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన ధర్నాకు సీపీఎం నాయకులు, రైతు సంఘం నాయకులు కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు, ప్రసాదం విష్ణు సంఘీభావం తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అధికారులు తెలిపారని తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Nov 13 , 2026 | 12:03 AM