ఆధ్యాత్మికతను అలవరచుకోవాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:44 AM
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని మద్దెలమ్మ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోశిక స్వామి తెలిపారు.
చౌటుప్పల్ టౌన, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని మద్దెలమ్మ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోశిక స్వామి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని మద్దెలమ్మ దేవాలయ ఆవరణలో బుధవారం వరసిద్ది వినాయక నందీశ్వర సహిత శివలింగం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా గణపతి పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహనం, హోమం, విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం పూర్ణాహుతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాసో్త్రక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశిక స్వామి మాట్లాడుతూ, దేవాలయాలలో భక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, మంచి నడవడికకు ఆధ్యాత్మికత దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 27వ తేదీన (గురువారం) నిర్వహించే మద్దెలమ్మ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని, మార్కండేయ దేవాలయం నుంచి మహిళా భక్తులు బోనాలతో వెళ్లి బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణలు చేసి మద్దెలమ్మ అమ్మ వారికి సమర్పిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో చేనేత సహకార సంఘం చైర్మన బడుగు మోహన బాబు, ఆలయ అధ్యక్షుడు గుర్రం నరసింహ, కార్యదర్శి గోశిక అంజయ్య, శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ అధ్యక్షుడు బడుగు జయ ప్రకాష్, ఆలయ ప్రతినిధులు గోశిక కరుణాకర్, కందకట్ల ఆనంద్, గోశిక రవి, సుంకి రవి కుమార్, పి.యాదగిరి, గోశిక భాస్కర్ పాల్గొన్నారు.