ప్రతీ పైసా పంచాయతీ ఖాతాలోకే!
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:06 AM
గ్రామ పంచాయతీల ఆదాయంపై ఇక వాటికే పూర్తి అధికారాలు దక్కనున్నాయి. ప్రజ ల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతీ పైసా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, చట్టసవరణ చేయడమేగాక, క్షేత్రస్థాయిలో అమలుకు కార్యాచరణను సైతం ప్రారంభించింది.
సొంత ఆదాయంపై పూర్తి నిర్వహణ బాధ్యతలు
జిల్లా వ్యాప్తంగా ఎస్‌బీఐ శాఖల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): గ్రామ పంచాయతీల ఆదాయంపై ఇక వాటికే పూర్తి అధికారాలు దక్కనున్నాయి. ప్రజ ల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతీ పైసా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, చట్టసవరణ చేయడమేగాక, క్షేత్రస్థాయిలో అమలుకు కార్యాచరణను సైతం ప్రారంభించింది.
గ్రామాల నుంచి వచ్చే ఆదాయా న్ని పంచాయతీలే వినియోగించుకునేలా జిల్లాలోని 427 పంచాయతీలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా లు తెరిచేందుకు కసరత్తులు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలను తెరిచేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీలకు జాతీయ బ్యాం కులను కేటాయించింది. అందులో భాగంగా జిల్లాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల ను కేటాయిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పంచాయతీలకు సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో ఓఎ్‌సఆర్-అకౌంట్-గ్రామపంచాయతీ పేరుతో ఖాతాలను అధికార యంత్రాం గం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది.
సొంత ఆదాయానికి ప్రత్యేక ఖాతాలు
గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఇతర రుసుముల ద్వారా సొంతంగా ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయం ఇకపై నేరుగా పంచాయతీ పేరిట ప్రారంభించే ఓఎ్‌సఆర్-అకౌంట్‌లోనే జమచేయనున్నారు. అందుకోసం జిల్లాలోని పంచాయతీకి కేటాయించిన ఎస్‌బీఐ శాఖలో ప్రత్యేక సేవింగ్ ఖాతాను తెరవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. సొంత ఆదాయ వనరు(ఓఎ్‌సఆర్) ద్వారా అన్ని రకాల రాబడిని ఈ ఖాతాలోనే జమ చేయడమేగాక పంచాయతీ నిర్వహణ వ్యయాలకు సైతం ఈ ఖాతాలనే వినియోగించుకోవాలని సూచనలు జారీ చేశారు.
తప్పనున్న సబ్ ట్రెజరీల చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు పంచాయతీ కార్యదర్శులకు ముఖ్యమైన కేంద్రాల్లో పరిమితంగా ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పంచాయతీలు వివిధ పన్నులు, రుసుముల పేరుతో వసూలు చేసే ప్రతీ పైసాను సబ్ ట్రెజరీల్లోని పంచాయతీ ఖాతాల్లో జమచేయాల్సిన విధానం అమలులో ఉంది. ఈ నిధులను గ్రామాభివృద్ధి, ఇతర నిర్వహణకు ఖర్చు చేయాలంటే పంచాయతీ కార్యదర్శి చెక్కులు రాసి, సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలు చేసిన తర్వాత వాటిని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాల్సివచ్చేది. అక్కడ చెక్కులను లెడ్జర్‌లో నమోదు చేసి, టోకెన్ జారీ చేస్తారు. అయితే టోకెన్‌కు ప్రభుత్వ ఆమోదం వచ్చిన తర్వాతనే చెల్లింపులు జరిగేవి. ఈ చెల్లింపులకు ప్రభుత్వ ఆమోదంతో పాటు సాంకేతిక తదితర కారణాలు చూపుతూ జాప్యం కారణంగా నిధులు చేతికి వచ్చేవరకు రోజుల కొద్దీ సమయం పడుతోందని విమర్శలు ఉన్నాయి. చెక్కులు నగదుగా మార్చుకోవడానికి 10 నుంచి 20 రోజుల సమయం పట్టడంతో గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా నిర్వహణ, వీధి దీపాల వంటి అత్యవసర పనులకు ఆర్థిక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో సర్పంచ్‌లు సొంత నిధులు వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి.
స్థానిక అవసరాలకు తక్షణ వినియోగం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త విధానంతో గ్రామపంచాయతీల సొంత ఆదాయం వాటి ఖాతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి. దీంతో నిధుల వినియోగంలో జాప్యం తగ్గడమే గాక స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కలగనుంది. ఖాతాల నిర్వహణ, సంతకాల అధికారం పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం అమలుకానుంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలోని పంచాయతీలకు కేటాయించిన ఎస్‌బీఐ బ్యాంక్ శాఖల్లో ఖాతాలు తెరవడానికి చర్యలు చేపట్టారు. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి రావడం ద్వారా పంచాయతీలకు నిధులు ఉన్నా, వినియోగానికి పడే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. గ్రామస్థాయి అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు, మైనర్ మరమ్మతులకు మరింత వెసులుబాటు దక్కనుందనే అభిప్రాయం సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పనులకు అందుబాటులో నిధులు
-తోటకూర శంకరయ్య, చందుపట్ల సర్పంచ్
పంచాయతీ సొంత ఆదాయ వనరులు సైతం గతంలో ట్రెజరీల్లో వేసి, వాటి వినియోగానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. ప్రస్తుతం ఓఎ్‌సఆర్-అకౌంట్‌ను పంచాయతీల పేరిట సొంతంగా నిర్వహించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆర్థికంగా కొంతమేర స్వేచ్ఛ దక్కనుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతులకు నిధులు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ఎస్టీవోల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తప్పాయి.
ప్రత్యేక ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు..
పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేర కు జిల్లాలోని 427 పంచాయతీల్లో ఓఎ్‌సఆర్-అకౌంట్స్‌ను ఎస్‌బీఐ శాఖల్లో తెరవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జీరో బ్యాలెన్స్‌తో సేవింగ్ ఖాతాగా పంచాయతీలే స్వయంగా ఈ ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు ను ప్రభుత్వం కల్పించింది. సొంత ఆదాయ వనరుల ద్వారా నిధులను ఈ ఖాతాల్లో జమ చేయడమేగాక, అవరాల మేరకు వ్యయం చేయడానికి అవకాశం కలగనుంది. క్షేత్రస్థాయిలో ఖాతాలు తెరవడానికి సిద్ధం చేశాం. నేడో, రేపో బ్యాంకులకు మార్గదర్శకాలు వచ్చిన వెంటనే ఖాతాలను ప్రారంభిస్తాం.
- కుందూరు శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి