7 నుంచి ఎర్రబెల్లి లింగమంతులస్వామి జాతర
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:22 AM
నిడమనూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబె ల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలింగమంతులస్వామి జాతరను ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
ఇతర జిల్లాల నుంచి సైతం భక్తుల రాక
నిడమనూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబె ల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీలింగమంతులస్వామి జాతరను ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదవులు ఈ జాతరను రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తారు. రెండో పెద్దగట్టు జాతరగా ప్రసిద్ధి చెందింది. ఒక సంవత్సరం సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు వద్ద, మరో సంవత్సరం ఎర్రబెల్లి వద్ద జాతరను నిర్వహిస్తారు. జాతరకుఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పరిసర జిల్లాల తో పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున జాతరకు తరలివచ్చి లింగమంతులస్వామిని దర్శించుకుంటారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జాతరలో బోనాలు సమర్పించి పెద్దఎత్తున యాటలు బలి ఇచ్చి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటా రు. గజ్జెల లాగులతో, కత్తికటారులతో యాదవు లు చేసే విన్యాసాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి. యాదవులతో పాటు అన్ని వర్గాలకు చెందిన భక్తులు సైతం లక్షలాదిగా జాతర కు తరలివచ్చి మొక్కుబడులు సమర్పించుకుంటారు. దాతల సహకారంతో ఆలయం వద్ద భక్తులకు కొన్ని వసతులు కల్పించారు. స్వామివారి దర్శనం కోసం మెట్ల మార్గంలో భక్తులకు ఎండ, వేడిమి తగలకుండా రేకులతో షెడ్డు వే యించారు. నిడమనూరు, హాలియా, మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ నుంచి ఎర్రబెల్లికి జాతర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతా రు. జాతర సందర్భంగా భక్తులకు తగిన వసతు లు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను భక్తులు కోరుతున్నారు. వేసవి కావడంతో జాతరకు హాజరయ్యే మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఆలయ చరిత్ర ఇదే..
లింగమంతులస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితమే శివుడు పార్వతీదేవిని వివాహమాడేందుకు లింగమంతులస్వామి రూపంలో ఎర్రబెల్లి సమీపంలోని గుట్టపై బండ చెరికలో వెలిశాడని చెప్పుకుంటారు. బండ చెరికలో స్వామి వెలసిన తీరుపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అప్పటి నుంచి యాదవులు స్వామిని ప్రత్యేకంగా కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. చెంచు వనిత అయిన మాణిక్యాలదేవిని గొర్రెల కాపరి రూపంలో ఉన్న లింగం(శివుడు) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ మాణిక్యాలదేవి అందుకు తిరస్కరిస్తుంది. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని శివుడు మాయోపాయం పన్నుతాడు. చెంచు సైన్యం నివాసం ఉంటున్న గుడారంపై దాడి జరుగుతుంది. శివుడితో పోరాడి చివరకు మాణిక్యాలదేవి లొంగిపోవడంతో ఇరువురికి కల్యాణం జరుగుతుంది. అప్పటి నుంచి ఎర్రబెల్లి కొండ చరియ వద్ద జాతరను నిర్వహిస్తూ లింగమంతులస్వామి, మాణిక్యాలదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
జాతరను ఘనంగా నిర్వహిస్తాం
జాతరను ఈ ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహిం చే తిరునాళ్లకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలి.
- మన్నెం వెంకన్నయాదవ్, ఆలయ చైర్మన్
7 నుంచి ఎర్రబెల్లి లింగమంతులస్వామి జాతర
నాలుగు రోజుల పాటు నిర్వహణ
ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
రెండో పెద్దగట్టు జాతరగా ప్రసిద్ధి

-