పర్యావరణ చట్టాలను పాటించాలి
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:07 AM
పర్యావరణ చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధివీలత అన్నారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధవీలత
భువనగిరి గంజ్, జూన 5 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మాధివీలత అన్నారు. శుక్రవారం స్థానిక పెన్షనర్స్ భవనంలో జిల్లా న్యాయ సేవా సంస్థ, పెన్షనర్స్ అసోసియోషన, రోటరీక్లబ్, జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో ‘పర్యావరణ చట్టాలు-పౌరుల పాత్ర’ అనే అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెక్కలు నాటడం వల్ల అవి చెట్లుగా పెరిగి భావితరాలకు ప్రాణవాయువును అందించి కాలుష్యాన్ని నియంత్రస్తాయన్నారు. నేషనల్ గ్రీన టిబ్యునల్ ఇచ్చన సూచన మేరకు గణ వ్యర్ధాల నిర్వాహణ కలిగి పచ్చదనం పెంపుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా మొక్కలు నాటారు. సమావేశంలో పిసిబిఈఈ వెంకన్న, పెన్షనర్స్ అసోసియోషన అధ్యక్షులు కోమటిరెడ్డి మోహనరెడ్డి, యూనిట్ అధ్యక్షులు తాడూరి కిష్టయ్య, ఈ సంస్థల ప్రతి నిధులు పి. ఆగేశ్వర్‌రావు, జిట్టా భాస్కర్‌రెడ్డి, రమే్‌షబాబు, అంజయ్య, విద్యాసాగర్, మునిసిసిల్ శానిటరి ఇనస్పెక్టర్ జాపరాలి, యాదగిరి, న్యాయవాదులు తదితరులున్నారు.