శిక్షణతో నర్సింగ్ అధ్యాపకుల్లో బోధన సామర్థ్యాల పెంపు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:28 AM
శిక్షణ కార్యక్రమాల ద్వారా అధ్యాపకుల్లో సామర్థ్యాలు మెరుగుపడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ అమితఅగర్వాల్ అన్నారు.
బీబీనగర్, జూలై 13(ఆంధ్రజ్యోతి): శిక్షణ కార్యక్రమాల ద్వారా అధ్యాపకుల్లో సామర్థ్యాలు మెరుగుపడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ అమితఅగర్వాల్ అన్నారు. సోమవారం బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో ఏఐఐఎంఎస్, నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటీవ్ టీచింగ్ అసిస్మెంట్ అండ్ రూడ్యూషన, క్వాలిటేటీవ్ రీసెర్చ్’ అనే అంశాలపై నిర్వహించిన ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జూలై 8నుంచి 10వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా నర్సింగ్ అధ్యాపకుల్లో ఆధునిక వినూత్న బోధన పద్ధతులపై అవగాహన , విద్యార్థులకు మరింత ప్రభావంతమైన బోధన నైపుణ్యాలు మెరుగు పడుతాయన్నారు. పరీక్షల రూపకల్పన మూల్యాంకణం శాస్ర్తీయంగా నిర్వహించే సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఏఐఐ ద్వారా కేమికేనేషన వంటి ఆధునిక సాంకేతికతలలో బోధనలో వినియోగించడం ఎలాగో నేర్చుకున్నట్లు తెలిపారు. క్వాలిటేటీవ్ రీసెర్చ్ ద్వారా నిర్వహించే విధానాలపై అవగాహన పెరిగి నాణ్యమైన పరిశోధనలు చేయడానికి అవకాశం దొరుకుతుందన్నారు. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులు ఆధునిక బోధన విదానాలు , సమర్ధవంతమైన మూల్యాంకణ పద్దతులు, పరిశోధన నైపుణ్యాలను పెంపొందించుకుని నాణ్యమైన నర్సిం గ్ విద్యను అందించగల సామర్ధ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ ప్రొఫేసర్ డాక్టర్ లతా టీ, ఏయిమ్స్ సూపరిండెంట్ మహేశ్వర్ రెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ అకాడమిక్ డీన రఫత రజియా తదితరులు పాల్గొన్నారు.