ముఖగుర్తింపుతో ‘ఉపాఽధి’
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:27 PM
వికసిత భారత గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజీవిక మిషన గ్రామీణ్(వీబీ జీ రామ్‌జీ) ఉపాధిహామీ పథకంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు.
వికసిత భారత గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజీవిక మిషన గ్రామీణ్(వీబీ జీ రామ్‌జీ) ఉపాధిహామీ పథకంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. క్షేత్ర స్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి అర్హులైన కూలీలకు న్యాయం చేయడ మే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన(ముఖ గుర్తింపు) అటెండెన్స విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో మస్టర్ల అతకతవకలకు కాలం చెల్లనుంది. అయితే సాంకేతిక సమస్యలు కూలీల శాపంగా మారాయి.
-(ఆంధ్రజ్యోతి-మద్దిరాల)
గతంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎనఎంఎంఎ్‌స) విధానంలో ఉపాధిహామీ కూలీలందరినీ ఒకేచోట నిలబెట్టి గ్రూప్‌ఫొటో తీసేవా రు. ఇందులో పనులకు రాని వారిని కూడా గ్రూపులో కలిపి హాజరు వేసే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం తీసుకొచ్చిన ముఖగుర్తింపు విధానంతో ప్రతి కూలీ ముఖాన్ని విడిగా స్కాన చేయాల్సి ఉంటుంది. స్కాన చేసిన ముఖం, ఆధార్ ఈ కేవైసీ డేటాతో సరిపోలితేనే హాజరు నమోదవుతుంది. ఉదయం కూలీలు పనికి వచ్చిన సమయంలో, పని ముగించుకొని వెళ్లే సమయంలో తప్పనిసరిగా ముఖం స్కాన చేయాల్సి ఉంటుంది. ఉదయం స్కాన చేసి వెళ్లే సమయంలో చేయకపోతే ఒక పూట కూలీ మాత్రమే ఇస్తా రు. ఒకరి బదులు మరొకరికి హాజరువేసే విధానం ఇక ఉండదు.
అక్రమాలకు చెక్
ముఖగుర్తింపు విధానంతో ఫీల్డ్‌అసిస్టెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. పనికి రాకున్నా అనుకూలమైన కూలీలకు హాజరువేసి ఆ సొమ్మును పంచుకునే అవకాశం ఉండదు.అర్హులైన కూలీలకుమాత్రమే వేతనాలు అం దేలా ఈసాంకేతికత భరోసా ఇస్తుందని కూలీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు
సాంకేతిక సమస్యలు కూలీల హాజరుపై తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూలీలకు హాజరు నమోదు కాక పని దినాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కంటి సమస్యలు ఉన్న వారు స్కానింగ్ చేయించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యరశ్మి ఎక్కువగా ఉండడం, మొబైల్ ఫోన సిగ్నల్స్ నాణ్యత లోపించడం వల్ల స్కాన పలుమార్లు విఫలమవుతుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి వేచి చూసినా హాజరు నమోదు కాకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఒకే మొబై ల్ ఉండడంతో హాజరు కోసం కూలీలు బారులు తీరి నిలబడితే సమయం వృధా అవుతోంది. హాజరు నమోదు కాకపోవడంలో కూలీలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. దీంతో కూలీలకు లభించాల్సిన వేతనాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో జాబ్ కార్డులు
సూర్యాపేట జిల్లాలో 23 మండలాల్లోని 486 గ్రామాల్లో 2,49,000 మంది కూలీలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. 1.67లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. ముఖగుర్తింపు విధానంతో కూలీల శ్రమకు తగ్గ ఫలితం త్వరగా అందనుంది. కూలీల హాజరు నేరుగా సర్వర్‌కు వెళ్లడం ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం తగ్గుతుంది. ఆధార్ అఽధారిత చెల్లింపుల ద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే కూలి జమ అవుతుంది. మేట్లు, ఇతర వ్యక్తుల జోక్యం లేకుండా తమ హాజరును తామే నిర్ధారించుకోవచ్చు.
పారదర్శకంగా కూలీలకు వేతనాలు
ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందించేందుకు కేంద్ర ప్రభు త్వం ముఖగుర్తింపు హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. కూలీలు ఆధార్‌కార్డులో ఫొటో స్పష్టంగా ఉందో లేదో చూసుకోవాలి. పని ప్రదేశంలో స్కాన చేసే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు కూలీలు సహకరించాలి. సాంకేతిక స మస్యలు వస్తే అధికారులు కూలీలను సమన్వయం చేస్తూ పనులు నిర్వహిస్తున్నారు. - శిరీష, ఇనచార్జి డీఆర్‌డీవో, సూర్యాపేట జిల్లా