Share News

ఉద్యోగుల రక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:16 AM

గాయపడిన ఉద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్రభుత్వవిప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

ఉద్యోగుల రక్షణ అందరి బాధ్యత
నోష్‌ల్యాబ్‌లో ప్రమాద స్థలిని పరిశీలిస్తున్న ప్రభుత్వవిప్‌ వేముల వీరేశం, కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : గాయపడిన ఉద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్రభుత్వవిప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో గురువారం రాత్రి నోష్‌ ఫార్మాల్యాబ్‌లో రియాక్టర్‌ నుంచి మంటలు వచ్చిన ప్రాంతాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌, ఆర్‌డీవో యానాల అశోక్‌రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ల్యాబ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రక్షణ చర్యలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన ఉద్యోగల పరిస్థితి గురించి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఎప్పటికప్పుడు ల్యాబ్‌ యాజమాన్యం, ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్‌ అనుమతి, కట్టడాలతో పాటు ఇతర అనుమతులు, వాటి వివరాలు కూడా అందదజేయాలని ఆదేశించామన్నారు. భవిష్యతలో ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

పూర్తి విచారణకు ఆదేశించాం: కలెక్టర్‌

నోష్‌ ఫార్మాల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారించి, నివేదిక అందించాలని ఆదేశించామని కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ అన్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నమూనాలను సేకరించాలని ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీ్‌ఫ్‌ ఇనస్పెక్టర్‌ శ్రీదేవిని ఆదేశించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కంపెనీ యజమాన్యం సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు చిట్యాల, నార్కట్‌పల్లి, నల్లగొండ రూరల్‌ పోలీ్‌సస్టేషన సిబ్బందితో పాటు ప్రత్యేకంగా స్పెషల్‌పార్టీ పోలీసులను నియమించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శివరాంరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సీఐ కైగూరి నాగరాజు, ఆర్‌ఐ జానీషరీఫ్‌, ఎస్‌ఐలు మామిడి రవికుమార్‌, విష్ణుమూర్తి, సైదాబాబు, ఏఎ్‌సలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:16 AM