ప్రజా ఉమ్యమాలను బలహీన పరిచేందుకు ఈ-ఫ్యూచర్ సిటీ డ్రామాలు: ఎస్ వీరయ్య
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:45 AM
ప్రజా ఉద్యమాలను బలహీన పరిచేందుకు ఈ-ఫ్యూచర్ సిటీ డ్రామాలు చేస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ఆరోపించారు.
ప్రజా ఉమ్యమాలను బలహీన పరిచేందుకు ఈ-ఫ్యూచర్ సిటీ డ్రామాలు: ఎస్ వీరయ్య
భువనగిరి గంజ్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఉద్యమాలను బలహీన పరిచేందుకు ఈ-ఫ్యూచర్ సిటీ డ్రామాలు చేస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ఆరోపించారు. బుధవారం భువనగిరిలో పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో? మంత మంది రైతులు భూములు కోల్పోతారో స్పష్టత ఇవ్వడంలేదన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకలేకే ఓటమి పాలయిందని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడం మానుకోవాలని వారు అన్నారు. 2026-27 వార్షిక బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించడంలో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ చిన్నచూపుతో ఉన్నాయని అన్నారు. నిధులు తీసుకరావడంలో జిల్లా మంత్రులు ఎక్కడ కూడా ప్రయత్నం చేసినట్టు కనిపించిన దాఖలాలు లేవన్నారు. సమావేశంలో ఎండీ.జహంగీర్, కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దాసరి పాండు, కల్లూరి మల్లేషం, పెంటయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, స్వామి, దయ్యాల నరసింహ, బోలగాని జయరాములు, వెంకటేష్, రాజు, ఉపేందర్ పాల్గొన్నారు.