Share News

పీఏసీఎస్‌ల బలోపేతానికి కృషి

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:30 AM

ఆలేరు నియోజకవర్గంలో పీఏసీఎ్‌సలను బలోపేతం చేస్తానని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

పీఏసీఎస్‌ల బలోపేతానికి కృషి
ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఆలేరు నియోజకవర్గంలో పీఏసీఎ్‌సలను బలోపేతం చేస్తానని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా మోటకొండూర్‌ మండలంలోని వర్టూర్‌ గ్రామానికి చెందిన నెమ్మాని సుబ్రహ్మణ్యం ప్రమాణస్వీకరణ, పదవీ భ్యాతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 8 పీఏసీఎ్‌సలు సొంతభవనాలు నిర్మించడానికి రూ.20 కోట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మంజూరు చేయించినట్లు తెలిపారు. వంగపల్లిలో పీఏసీఎస్‌ భవనానికి సరియైున స్థలం లేనందున మోటకొండూర్‌ మండల కేంద్రంలో నూతన భవన నిర్మాణానికి స్థలం కేటాయించామని, నూతన చైర్మన్‌ నెమ్మాని సుబ్రహ్మణ్యంతో కొబ్బరికాయ కొట్టి భూమి పూజలు చేసి పనులు ప్రారంభిస్తామని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పీఏసీఎ్‌సలు నిధులు రైతులకు సరియైున రుణాలు, ఇవ్వకుండ సంఘాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్లు అందరూ రైతులకు అందుబాటులో ఉంటూ ఎరువులు, యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. చైర్మన్‌ నెమ్మాని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంబీసీ కులానికి చెందిన తనను వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా నియమించినందు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వంగపల్లి పీఏసీఎస్‌ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉంటానని వారికి యూరియా, ఎరువులు, ఽధాన్యం కొనుగోలు, గన్నీబాగులు, ట్రాన్స్‌పోర్టు లారీలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వ విప్‌ బీర్లయ్యకు, ప్రభుత్వానికి మంచిపేరు తీసువస్తానని అన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య చైర్మన్‌ సుబ్రహ్మణ్యంతో సహా డైరెక్టర్లను ప్రమాణస్వీకారం చేయించి, సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు, గుండాల మార్కెట్‌ కమిటి చైర్‌పర్సన్లు అయినాల చైతన్యరెడ్డి, విమల, యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపల్‌ చైర్‌పర్సన్లు గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్‌, బాలమణి, డీసీవో నాగార్జున యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజపేట పీఏసీఎస్‌ చైర్మన్లు చీర శ్రీశైలం, శంకర్‌నాయక్‌, నెమెలె మహేందర్‌గౌడ్‌, నార్మాక్స్‌ డైరెక్టర్‌ కల్లెపల్లి శ్రీశైలం, స్థానిక సర్పంచ్‌ రవళిప్రతాప్‌, డైరెక్టర్లు కొల్లూరు పుష్ప, బాస్కరుని రఘునాధరాజ్‌, గిరిబోయిన మానస, కొక్కొలకొండ ఉపేందర్‌, వై సిద్దురాజు, జోగు శంకర్‌, గద్ద లలిత, కల్లెపల్లి మహేందర్‌, ఎర్ర సంజీవ, గుజ్జ బలరాం, జోగు అయిలయ్య, కుండే ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:30 AM