Share News

మునిసిపాలిటీల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:00 AM

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్‌ బీర్ల అలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మునిసిపాలిటీల అభివృద్ధికి కృషి
ఆలేరులో కచ్చకాల్వ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ అయిలయ్య

ప్రభుత్వ విప్‌ అయిలయ్య, ఎంపీ చామల

ఆలేరు, జూన 12 (ఆంధ్రజ్యోతి) : ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్‌ బీర్ల అలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని 12వ వార్డులో 1.90కోట్లతో చేపడుతున్న కచ్చకాల్వ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కచ్చకాల్వ అసంపూర్తిగా ఉండడంతో వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు పారుదల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఈ నిర్మాణ పనులు పూర్తియిన తర్వాత ఆ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని చెప్పారు. నాణ్యత ప్రమాణాలతో పనులు వేగంగా పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కాల్వ నిర్మాణం పూర్తయితే పట్టణంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మహిళా కార్పొరేషన ఛైర్‌పర్సన బండ్రు శోభారాణి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన చైతన్య మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బీజని బాలమణి భాస్కర్‌, వైస్‌ చైర్మన అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు మల్లెల సరిత, మరియమ్మ, జూకంటి సంపత, పస్తం ఆంజనేయులు, కోఆప్షన మెంబర్లు చింతకింది మురళి, సమంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, మేనేజర్‌ జగన్మోహన, కాంగ్రెస్‌ నాయకులు ముదిగొండ శ్రీకాంత, దూడల రాజశేఖర్‌, మల్లెల శ్రీకాంత, ఆలేటి అనిల్‌, ఎండీ గౌస్‌మియా పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:00 AM