Share News

ఏప్రిల్‌ నుంచి ఈ-20 పెట్రోల్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:36 AM

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇథనాల్‌ 20(ఈ-20)పెట్రోల్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ-20 పెట్రోల్‌ ఆడపాదడపా సరఫరా అవుతోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మాత్రం స్పీడ్‌, నార్మల్‌ పెట్రోల్‌ ఇక నుంచి ఈ-20 పెట్రోల్‌గా లభించనుంది.

 ఏప్రిల్‌ నుంచి ఈ-20 పెట్రోల్‌

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇథనాల్‌ 20(ఈ-20)పెట్రోల్‌ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ-20 పెట్రోల్‌ ఆడపాదడపా సరఫరా అవుతోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి మాత్రం స్పీడ్‌, నార్మల్‌ పెట్రోల్‌ ఇక నుంచి ఈ-20 పెట్రోల్‌గా లభించనుంది.

- (ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

పెట్రోల్‌ పంపిణీలో సమూలమార్పులకు కేంద్ర ప్రభు త్వం శ్రీకారం చుడుతోంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి అన్ని బంకు ల్లో 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ మాత్రమే లభించనుంది. ఈ ఇంధనం నాణ్యతాపరంగా 95 రీసెర్చ్‌ అక్టెన నెంబర్‌(ఆర్‌ఓఎన) కలిగి ఉండాలని కేంద్రం ఆయిల్‌ కంపెనీలను ఆదేశించింది. ఆర్‌ఓఎన అనేది వాహన ఇంజన లోపల ఒత్తిడిని పెట్రోల్‌ ఎంత సమర్ధంగా వినియోగించగలదో చూపే సంఖ్య. ఇంధనం అసమానంగా మండినప్పుడు శబ్ధాన్ని సృష్టిస్తోంది. దీంతో కాలక్రమేణా ఇంజన దెబ్బతింటుంది. ఆర్‌ఓఎన ఎక్కువగా ఉంటే ఇంజన తట్టుకుంటుంది. అయితే ఇథనాల్‌ అధిక అక్టెన విలువ 108 ఆర్‌ఓఎన కలిగి ఉంటుంది. దీంతో పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్‌ కలపడం ద్వారా ఇంజన సామర్ధ్యం పెరుగుతుంది. ఈ క్రమంలో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం, ఆర్‌ఓఎన 95 కలిగిన పెట్రోల్‌ను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.

తప్పనున్న బాధలు..

ఈ-20 పెట్రోల్‌తో ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురులో 20శాతం భారం తప్పనుంది. చెరుకు, తదితర పంటల ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం, ప్రత్యేక వంగడాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ వ్యవసాయ రంగానికి ఆర్థిక పరిపుష్టి లభించే అవకాశాలు పెరుగుతాయంటున్నారు. అదేవిధంగా ఈ-20 వాహనాలతో వాహన వాయుకాలుష్యం తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

అనుమానాలు ఉన్నా..

ఈ-20 పెట్రోల్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. వాహన మైలేజ్‌ తగ్గుతుందని, ఇంజన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని వాహనదారులు అంటున్నారు. కానీ ఇవన్నీ అనుమానాలేనని, నాణ్యత పరిశోధనల అనంతరమే ఈ-20 పెట్రోల్‌ను కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని అధికారులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 20శాతం దిగుబడి భారం తప్పనున్నందున పెట్రోల్‌ ధరను తగ్గించాలని వాహనదారులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 500లకు పైగా పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 30లక్షల లీటర్ల పెట్రోల్‌, సుమారు కోటి లీటర్ల డీజిల్‌ విక్రయాలు సాగుతున్నట్లు అం చనా. యాదాద్రిభువనగిరి జిల్లాలో 126 బంక్‌ల ద్వారా రోజుకు సుమారుగా 10లక్షల లీటర్ల డీజిల్‌, 4,50లక్షల లీటర్ల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతుంటాయని అంచనా.

ఈ-20 పెట్రోల్‌ సరైన నిర్ణయం

ఈ-20 పెట్రోల్‌ నిర్ణయం సరైనదే. నాణ్యతపై వాహనాదారులు అనుమానాలను పెట్టుకోవద్దు. దేశీయ ఉత్పత్తులతో దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌరశక్తి, మేకింగ్‌ ఇండియా తదితర ఆత్మ నిర్భయ భారత పథకాలలో భాగమే ఈ-20 పెట్రోల్‌. ఈ విధానంతో పెట్రోల్‌, డిజిల్‌ కొరత తగ్గే అవకాశాలు ఉంటాయి.

- సకిలం మురళీ, అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా పెట్రోల్‌ బంక్‌ అసొసియేషన .

Updated Date - Mar 18 , 2026 | 12:36 AM