Share News

డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:43 AM

డాక్టర్లు మానవతా దృక్పథంతో పేదల కు వైద్య సేవలందించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘అద్వితీ- 2026’ పేరున నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.

డాక్టర్లు మానవత్వంతో పని చేయాలి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్లు మానవతా దృక్పథంతో పేదల కు వైద్య సేవలందించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. గురువారం నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ‘అద్వితీ- 2026’ పేరున నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి పవిత్రమైనదన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని సూచించారు. కళాశాలలో సమస్యలుంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నెలలోపు వీటిని మంజూరు చేస్తామన్నారు. ఏఐజీ ఆసుప త్రి డాక్టర్‌ నాగేశ్వరరెడ్డిని ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకొచ్చామని, నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం 45మంది చొప్పున తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు. విద్యాభివృద్ధి లో భాగంగా బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను, ప్రతిక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పట్టణంలోని మరికొన్ని పా ఠశాలలను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. రూ.900 కోట్లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్లగొండను స్మార్ట్‌ సిటీగా, మోడల్‌ సిటీగా చేస్తామన్నారు. మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాల్లో పేద ప్రజల కు సేవలు అందించాలని కోరారు. అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) జె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ డాక్టర్‌ వత్తి పవిత్రమైందని, రోగులను చిరునవ్వుతో పలకరించి వారికి వైద్యం చేయాలని సూ చించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అమీర్‌ ఆశ్రఫ్‌ అలీ, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సత్యనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గడువులోగా రోడ్డు పూర్తి కావాలి

నల్లగొండ రూరల్‌: జిల్లాలో జరుగుతున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అదేశించారు. క్యాంపు కార్యాయలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అప్పాజీపేట, బ్రహ్మణ వెల్లంల రహదారి పనుల పురోగతిని పరిశీలించి, రెండు నెలల్లోగా, సోమనవాగు పై నిర్మాణంలో ఉన్న పగిడిమర్రి వంతెన పనులను మూడు నెలల్లోగా పూర్తి పూర్తి చేయాలని అదేశించారు. కనగల్‌, మామిడాల, గోదోరిగూడెం, ఎల్లమ్మగూడెం, మామిడాలలో రహదారులు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వై. అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:43 AM