Share News

దివీస్‌ సేవలు అభినందనీయం

ABN , Publish Date - May 02 , 2026 | 12:21 AM

మునిసిపాలిటీలోని దివీస్‌ సంస్థ ఉత్తమ నిర్వహణ, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు.

దివీస్‌ సేవలు అభినందనీయం
దివీస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుబాబుకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు ను అందజేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌, పక్కన దివీప్‌ జీఎం సుబ్బారావు

చౌటుప్పల్‌ టౌన, మే 1 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని దివీస్‌ సంస్థ ఉత్తమ నిర్వహణ, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డును దివీస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ మధు బాబు, జీఎం కే.సుబ్బారావుకు మంత్రి వివేక్‌ అందజేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి హరిచందన దాసరి పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:21 AM