Share News

బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:27 AM

వేములపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న పార్వతీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

 బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

12మందికి స్వల్ప గాయాలు

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో ఘటన

వేములపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తున్న పార్వతీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండాల ప్రవేశంలో భక్తులు తోపులా ట జరగడంతో 20మంది నిప్పులపై పడ్డారు. పోలీసు సిబ్బంది అప్రమత్తమై వారిని బయటకు లాగటంతో 12మందికి స్వల్ప గాయాలయ్యా యి. ఈ నెల 1 నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా, మంగళవారం ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 10 వేల మంది భక్తులు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించగా, సాయంత్రం ప్రభల ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలు బుధవారం తెల్లవారుజామున నిర్వహించారు. మూడు అడుగుల మేర ఉన్న అగ్నిగుండాల్లో స్వామివారి పల్లకిలో ఉత్సవ విగ్రహంతో మూడోసారి ప్రవేశిస్తుండగా ఓ మహిళ పల్లకి పట్టుకోబోయే సమయంలో జారి పడింది. దీంతోపాటు భక్తులు ఒక్కసారిగా ప్రవేశానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగి 20 మంది అగ్నిగుండంలోని నిప్పుల్లో పడ్డారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వేములపల్లి, మాడ్గులపల్లి ఎస్‌ఐలు డి.వెంకటేశ్వర్లు, కృష్ణయ్య తమ సిబ్బందితో అప్రమత్తమై అగ్నిగుం డంలో పడిన వారిని వెంటనే బయటకు లాగారు. ఈ ఘటనలో ఆమనగల్లు గ్రామానికి చెందిన ఉత్తెర్ల కృ ష్ణయ్య, మారిపెద్ది సా యి, వట్టె మానసలతో పాటు, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మం డలం దోసపహాడ్‌కు చెందిన సింగం వినోద, మిర్యాలగూడకు చెందిన మేడ బోయిన సైదమ్మ, బీమారం గ్రామానికి చెందిన సో మగాని నాగరాజు, నాయకం గంగమ్మ, మేకల మల్లమ్మ, మేకల పు ష్ప, దువాని విజయ, కొరివి సంధ్య, ఏర్పుల సంధ్యకు స్వల్ప గాయా లయ్యాయి. గాయపడిన కొందరిని 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా కొంతమంది ఇంటి వద్ద, మరికొంత మంది మిర్యాలగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొం దారు. తోపులాట సమయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తులకు బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పిందని పలువురు అభినందించారు. గాయపడి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి పరామర్శించారు.

భీమారం గ్రామస్థులకు గాయాలు

కేతేపల్లి: ఆమనగల్లు జాతర కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామస్థులకు గాయాలయ్యాయి. వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ప్రతీ ఏడాది రామలింగేశ్వరస్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ఆమనగల్లు పక్కనే ఉన్న బీమారం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లారు. అగ్నిగుండాల కార్యక్రమంలో తోపులాట ఘటనలో మండలంలోని భీమారం ఉపసర్పంచ్‌ సోమగాని పార్వతమ్మ కుమారుడు సోమగాని నాగరాజు, అంగన్‌వాడీ ఆయా నాయకం గంగమ్మ, గ్రామస్థులు ఏర్పుల సంధ్య, దూబని విజయ, కొరివి సంధ్య, మేకల మల్లయ్య, మేకల పుష్పకు తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో సోమగాని నాగరాజు, నాయకం గంగమ్మ, ఏర్పుల సంధ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. భక్తితో జాతరకు వెళ్లిన ఏడుగురు తీవ్రంగా గాయపడటంతో భీమారం గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేతేపల్లి తహసీల్దార్‌ రమాదేవి, రాజ్యసభ మాజీ సభ్యుడు, సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప రామర్శించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వీరి వెంట భీమారం సర్పం చ్‌ చిమట పద్మవెంకన్నయాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మారం వెంకటరెడ్డి, పార్టీ నాయకులు కె.ప్రదీ్‌పరెడ్డి, బి.శ్రీనివాసయాదవ్‌, ఆర్‌.శ్రీనివాస్‌గౌడ్‌, జి.నాగరాజు ఉన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:27 AM