Share News

తల్లితో గొడవపడి పిల్లలతో అదృశ్యం

ABN , Publish Date - May 26 , 2026 | 11:39 PM

పెద్దవూర, మే 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన వివాహిత ఇద్దరు కుమారులతో అదృశ్యమైంది.

తల్లితో గొడవపడి పిల్లలతో అదృశ్యం

పెద్దవూర, మే 26 (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా మనస్తాపం చెందిన వివాహిత ఇద్దరు కుమారులతో అదృశ్యమైంది. నల్లగొండ జిల్లా పెద్దవూర ఎస్‌ఐ గోపాల్‌రావు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మల్లెవానికుటంతండాకు చెందిన రమావత్‌ ప్రభాకర్‌, నాగమణిల కుమార్తె మౌనికకు ఐదేళ్ల కిందట నాగర్‌కర్నూలు జిల్లా డోర్నాలకు చెందిన నాగార్జునతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్‌, నాగచైతన్యలు ఉన్నారు. రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త నాగార్జున మృతి చెందగా మౌనిక తన ఇద్దరు పిల్లలతో కలిసి మల్లెవానికుంటతండాలోని తన పుట్టింటి వారి వద్ద ఆశ్రయం పొందుతోంది. ఈ నెల 22న తల్లి నాగమణికి, మౌనికకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక మరుసటి రోజు ఈ నెల 23న ఉదయం 9గంటల సమయంలో ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికీ చెప్పకుండా బయటకువెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో, మౌనిక చెల్లెలు రమావత్‌ శ్రావణి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు. అదృశ్యమైన ముగ్గురి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ ఫోన్‌ 8712670298 లేదా పోలీ్‌సస్టేషన్‌ నెంబర్‌ 8712675111కు సమాచారం అందించాలని కోరారు.

Updated Date - May 26 , 2026 | 11:40 PM