డిండి..అడుగంటి
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:39 PM
డిండి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వర్షాధార మధ్యతరహా ప్రాజెక్టు అయిన డిండి ప్రాజెక్టుకు సూప ర్ ఎల్‌నినో ఎఫెక్ట్ పడింది.
దీంతో వర్షాభావ పరిస్థితు లు నెలకొని రిజర్వాయర్‌కు చుక్క నీరు వచ్చి చేరలేదు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న 33 అడుగుల నీటి నిల్వలను చూసి ఈ వానాకాలం రైతులు సాగుచేసిన పంట పొలాలు నిలువనా ఎండిపోతున్నాయి. మరో 40 రోజుల నీరు అవసరం ఉండగానే ప్రాజెక్టులోని జలాలు అడుగంటాయి. వ్యవసాయ బావులు, బోర్లతో నీటి వనరులు ఉన్న రైతులు పంటలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నా విద్యుత కోతల కారణంగా చివరి మడికి నీరు అందడంలేదు. దీంతో ఈ వానాకాలం ఆయకట్టు పరిధిలో వరి సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి. 2025 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు డిండి ప్రాజెక్టు ఓవర్‌ప్లో అయింది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో సుమారు 4 నెలల పాటు అలుగుపోస్తూనే ఉంది. 2025 వానాకాలం పంటలకు నీటిని విడుదల చేశారు. పంటలు పూర్తయ్యే సమయానికి ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 36 అడుగులు (2.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కానీ 2026 జూన 19వ తేదీ నీటిని విడుదల చేసే సమయానికి హెడ్ రెగ్యులేటర్ ద్వారా మూడు అడుగుల నీరు లీకేజీతో వాగుతో కలిసింది. నిల్వ ఉన్న 33 అడుగుల నీటిని ఈ వానాకాలం పంటలకు విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ హెచ్చరికలను లెక్క చేయకుండా నీటిని నీటి పారుదలశాఖ అధికారులు విడుదల చేశారు. సుమారు 40 రోజుల నీరు అవసరం ఉండగానే రిజర్వాయర్ అడుగంటింది. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో సుమారు 15 వేల ఎకరాలలో పంటకు నష్టం వాటిళ్లనుంది.
రైతులను ముంచిన షట్టర్ల లీకేజీ
షట్టర్ల లీకేజీ కారణంగా మూడు అడుగుల నీరు వా గు పాలైంది. షట్టర్లు లీకేజీ లేకుండా ఉంటే వాగుపాలై న మూడు అడుగుల నీటితో పంటలు గట్టేక్కెవని రైతులు పేర్కొంటున్నారు. వీటికి తోడు పరిమితికి మిం చి అధికారులు నీటిని విడుదల చేయడం వల్ల నీరం తా వృథాగా వాగులో కలిసిపోయింది. నీటి వృథాను నియంత్రించడంలో సంబంధితశాఖ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. నీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, డిస్ర్టిబ్యూటరీలకు తలుపులు లేకపోవడం వల్ల నీరంతా వాగులోకి వెళ్లింది.
కల్వకుర్తి ఎత్తిపోతల నీటి కోసం ప్రయత్నం
కల్వకుర్తి ఎత్తిపోతల నీటితో డిండి ప్రాజెక్టును నిం పి ఆయకట్టు పంటలను కాపాడాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యేను కోరారు. కల్వకుర్తి ఎతిపోతల నీటి కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా డిండి ప్రాజెక్టుకు ఎగువన ఉన్న రైతులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. దిగువకు నీటి విడుదలను అడ్డుకున్నారు. తమ పంట చేలు ఎం డుతుంటే దిగువకు నీరు ఎలా ఇస్తామని ఎగువ రైతు లు అడ్డు చెబుతూ వస్తున్నారు. దీంతో డిండి ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం డిండికి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పైర్లు తమ కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు కంటతడిపెడుతున్నారు. సుమారు ఒక ఎకరా సాగుకు రూ. 36 నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఎకరా పొలానికి పెట్టిన పెట్టుబడితో పాటు దిగుబడి 25 క్వింటాళ్లు రైతులు నష్టపోయారు. వెరసి ఒక ఎకరా సాగుచేసిన రైతుకు రూ.1.10 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు వ్యవసాయ భూములను కౌలుకు తీసుకొని సాగు చేశారు. అప్పులు చేసి పెట్టుబడులుపెట్టిన రైతులకు గుండెకోత మిగిలింది.
డిండి ప్రాజెక్టు షట్టర్లకు మరమ్మతు చేయాలి
డిండి ప్రాజెక్టు షట్టర్లకు మరమ్మతులు చేపట్టి లీకేజీని అరికట్టాలి. లీకేజీ వల్ల మూడు అడుగుల నీరు వాగు పాలైంది. గేరు బాక్సులు పనిచేయడం లేదు. ప్రాజెక్టులో 15 అడుగుల మేర పూడిక మేట వేసింది. పూడిక వల్ల అర టీఎంసీ నీరు నిల్వ ఉండకుండా దిగువకు వెళుతుంది. డిండి ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం వీడి షట్టర్ల కు మరమ్మతులు, పూడిక తీయించాలి.
- ఎండి.మైనుద్దీన, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు