Share News

6న భువనగిరికి డీజీపీ శివధర్‌రెడ్డి

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:40 AM

డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 6న భువనగిరికి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని, భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు.

6న భువనగిరికి డీజీపీ శివధర్‌రెడ్డి

జిల్లా పోలీస్‌ కార్యాలయం, భరోసా కేంద్రం ప్రారంభం

తాత్కాలికంగా తీరనున్న ఇబ్బందులు

త్వరలోనే శాశ్వత భవనాలు

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 6న భువనగిరికి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని, భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయనతో పాటు అదనపు డీజీపీ (మహిళ భద్రత) చారుసిన్హా, మల్టీజోన్‌-2అదనపు డీజీపీ డీ.చౌహన్‌ రానున్నారు. ఈమేర కు ఎస్పీఅక్షాంశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తు న్నారు. ఉదయం 11గంటలకు రానున్న డీజీపీ సుమా రు రెండు గంటలపాటు భువనగిరిలో ఉండనున్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయం విభాగాలు ఇలా..

పోలీస్‌ శాఖకు జిల్లా పోలీస్‌ కార్యాలయం (డీపీవో) గుండెకాయలాంటింది. జిల్లా పోలీస్‌ పరిపాలనా విభాగం డీపీవో కేంద్రంగా ఉంటుంది. భువనగి రి రూరల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌ను సుమారు రూ.20లక్షల వ్యయంతో ఆధునీకరించి తాత్కాలికంగా ఇక్కడ డీపీ వో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ అజమాయిషీలో పనిచేసే డీపీవోలో ముఖ్యమైన ఐదు విభాగాలు ఉంటాయి. ఆ ఐదు విభాగాలకు సీఐ స్థాయి అధికారుల నియామకం పూర్తయింది. అలాగే డీపీవోలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఏ-సెక్షన్‌ (స్టాఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌), బీ-సెక్షన్‌ (బడ్జెట్‌), సీ-సెక్షన్‌ (అట్రాసిటీ తదితర కేసులు), పీ-సెక్షన్‌ (ఐటీ నిర్వహణ, సిబ్బంది వేతనాలు, బిల్డింగ్స్‌) ఉంటాయి. అలాగే జిల్లా పోలీస్‌ కు ట్రాఫిక్‌, ఎస్పీ, షీ-టీమ్‌, ఇంటిలిజెన్స్‌ తదితర ఉప విభాగాలు ఉంటాయి. ఉప విభాగాలు కూడా కార్యాలయ భవనాల అవసరం. డీపీవోలో సిబ్బంది కొరత ఉంది. అయితే త్వరలో పోలీ్‌సశాఖలో బదిలీలతో ఈ ఐదు విభాగాలకు అధికారులతో పాటు డీపీవో అధికారులు, సిబ్బందిలో మార్పులు, ఖాళీల భర్తీకి అవకాశం ఉంది.

బైపాస్‌ రోడ్డులో ఎస్పీ కార్యాలయం

ఎస్పీ కార్యాలయాన్ని ప్రస్తుతానికి క్యాంపు కార్యాలయంలోనే కొనసాగిస్తున్నారు. అయితే బైపాస్‌ రోడ్డులో కేంద్రీయ విద్యాలయం పక్కన గతంలో కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో సుమారు రూ.3కోట్ల వ్యయంతో ఎస్పీ కార్యాలయం శాశ్వత భవనాన్ని త్వరలో నిర్మించే యోచనలో పోలీ్‌సశాఖ ఉంది. అయితే అదే ప్రాంగణంలో డీపీవో కార్యాలయం కూడా నిర్మిస్తారా? లేదా? ప్రభుత్వం శాశ్వత కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తుందో లేదో తేలాల్సి ఉంది. పట్టణ శివారులో అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా ఆర్మ్డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ కేంద్రాన్ని కూడా శాశ్వత భవనంలోకి తరలించే ఆలోచనలో పోలీస్‌ ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ప్రభుత్వ భవనాల కొరత ఉంది. దీంతో యాదగిరిగుట్ట సమీపంలో గతంలో పోలీస్‌ శిక్షణ కేంద్రానికి కేటాయించిన స్థలంలోకి తరలిస్తారా? లేదా? మరో స్థలం కేటాయింపుపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే రెండు అదనపు ఎస్పీల కార్యాలయాలకు కూడా భవనాల కొరత వేధిస్తోంది. ప్రస్తుతానికి ఆ రెండు కార్యాలయాలు కూడా తాత్కాలికంగా ఇరుకు భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

భరోసా కేంద్రం..

పోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల్లో మైనర్లకు తాత్కాలిక ఆశ్రయం, న్యాయ, వైద్య, కౌన్సిలింగ్‌ తదితర సేవలు అందించేందుకు నల్లగొండ రోడ్డులోని ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో నిర్మించిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన రెండు మూడు రోజులకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. భరోసా కేంద్రం ప్రారంభంతో పోక్సో కేసుల బాధితులు, విచారణ తదితర అంశాల్లో మరింత గోప్యతకు అవకాశం ఏర్పడనుంది.

డీపీవో విభాగాలు, అధికారులు

డిస్ట్రిక్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ (డీఎ్‌సబీ): సురేశ్‌

సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌): ప్రవీణ్‌

ఇన్ఫర్మెషన్‌ టెక్నాలజీ(ఐటీసెల్‌): శ్రీకాంత్‌

డిస్ట్రిక్‌ క్రైమ్‌ రిపోర్ట్‌ బ్యూరో (డీసీఆర్‌బీ): హనుమంతు

కమ్యూనికేషన్‌: నరేశ్‌

Updated Date - Apr 04 , 2026 | 12:40 AM