ఫ యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:06 AM
యాదగిరిగుట్ట, జూలై 2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి ఆలయ ఖజానాకు 28 రోజుల్లో రూ.2.78కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
యాదగిరిగుట్ట, జూలై 2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి ఆలయ ఖజానాకు 28 రోజుల్లో రూ.2.78కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గత నెల 4వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నృసిం హుడిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను గురువారం కొండ కింద వ్రత మండపంలో లెక్కించారు. 28 రోజుల్లో రూ.2,78,13,079 నగదు తో పాటు 708 గ్రాముల మిశ్రమ బంగారం, 3.150 కిలోల మిశ్రమ వెండి సమకూరింది. విదేశీ కరెన్సీ 750 అమెరికా డాలర్లు, 20 ఇంగ్లండ్ పౌండ్లు, 50 కెనడా డాలర్లు, 10 నేపాల్ రూపాయి, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 10 కతార్ రి యాల్, 14 మలేషియా రింగిట్లు, 380 థాయ్‌లాండ్ థాయ్‌బాట్లు, 2 సింగపూర్ డాలర్లు, 500 కంబోడియా రియల్, 1 సౌదీ అరేబియా రియాల్, 1,04,000 వియత్నాం డాంగ్లు, 5 న్యూజిలాండ్ డాలర్లు, 50 ఫిలిప్పైన్స్ పెసో, 5 యూరప్ యూరోలు సమకూరింది. దేవస్థానం ఈవో భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఇన్‌చార్జి డీఈవో జూశెట్టి కృష్ణ పర్యవేక్షణలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, నాయిబ్రాహ్మణులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది కానుకలను లెక్కించారు.