Share News

చెక్‌బౌన్స పరిష్కారానికి సహకరించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:23 AM

చెక్‌ బౌన్స కేసుల పరిష్కారానికి బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆర్యదర్శి వీ.మాధవిలత అన్నారు.

  చెక్‌బౌన్స పరిష్కారానికి సహకరించాలి

భువనగిరిటౌన, జూలై 13(ఆంధ్రజ్యోతి): చెక్‌ బౌన్స కేసుల పరిష్కారానికి బ్యాంకు అధికారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ జయరాజు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆర్యదర్శి వీ.మాధవిలత అన్నారు. ఈనెల 18న నిర్వహించనున్న చెక్‌బౌన్సకేసుల ప్రత్యేక లోక్‌ అదాలత పై ఆదివారం జిల్లా కోర్టులో బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రుణ గ్రహీతలు చెల్లించాల్సిన బకాయిలపై పరిమితుల మేరకు మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక కేసులు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. కేసుల పరిష్కారంతో బ్యాంకులకు రుణ రికవరీ పెరుగుతుందన్నారు. చెక్‌బౌన్స కేసుల ప్రత్యేక లోక్‌ అదాలత పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంకుల వారీగా సమీక్షించారు. సమావేశంలో ఎస్‌బీఐ, యూబీఐ, డీజీవీపీ లీడ్‌ బ్యాంకు తదితర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 12:23 AM