Share News

సంప్రదాయానికి భిన్నంగా..

ABN , Publish Date - May 09 , 2026 | 12:18 AM

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరిరూరల్‌): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి వెంకన్న వృ త్తి రీత్యా పోలీస్‌ హెడ్‌ కాని స్టేబుల్‌. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నా వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుసు ్తన్నాడు.

  సంప్రదాయానికి భిన్నంగా..

సేంద్రియ ఎరువులతో కూరగాయల సాగు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరిరూరల్‌): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల తొండ గ్రామానికి చెందిన ఓడపల్లి వెంకన్న వృ త్తి రీత్యా పోలీస్‌ హెడ్‌ కాని స్టేబుల్‌. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నా వ్యవసాయంపై మక్కువతో సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుసు ్తన్నాడు. సంప్రదాయ పంటలకు భిన్నంగా తనకు ఉన్న 7 ఎకరాల భూమిలో బీట్‌రూట్‌, క్యారెట్‌, టమాటా, పాలకూ ర, మిర్చి వంటి పంటలను సేంద్రియ ఎరువులతో పండిస్తున్నా డు. ఈ ప్రాంతంలో ఎవరూ కూడా పండించనటువంటి బీట్‌రూ ట్‌, క్యారెట్‌ పండిస్తూ తన కూతురు నడుపుతున్న నేచర్‌ ఫుడ్‌ ప్రొ డక్ట్‌ కంపెనీకి పంపిస్తూ కంపెనీ ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. బీట్‌రూట్‌ ఎకరాకు సుమారు 100 క్వింటాళ్లు పం డించవచ్చని, కంపెనీకి పంపే రేటు ప్రకారం ఖర్చులు పోనూ సుమారు రూ.లక్ష వరకు లాభం ఆర్జిస్తున్నాడు. బీట్‌రూట్‌, క్యారెట్‌ పండించడానికి నవంబరు ఉంచి అనువైన వాతావరణం ఉంటుందని, అధిక దిగుబడితో మంచి లాభాలు పొందవచ్చన్నారు.

పంట మార్పిడి అవలంబించాలి...

నాకు సెలవు దొరికినప్పుడల్లా సంప్రదాయ పంటలకు భి న్నం గా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్నాను. వృతి రీత్యా బిజీగా ఉండడంతో కూలీలను పెట్టుకుంటున్నా. నేను పండించిన పంటలను నా కుమార్తె కంపెనీకి పంపిస్తా. అంతకు ముందు కోసం ముందుగా రంగారెడ్డి జిల్లా నుంచి బీట్‌రూట్‌, క్యారెట్‌ దిగుమతి చేసుకునేవాడిని. నేను పండిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తో నాకు ఉన్న భూమిలో క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా, పాలకూర, మిర్చి, మునగా పంటలు పండిస్తున్నా. రైతులందరూ పం ట మార్పిడి అవలంబించి ఆధునిక సాగుపై దృష్టి సారించాలి. పదవీ విరమణ పొందిన వెంటనే పూర్తి కాలం రైతుగా మారి నూతన పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తాను.

- ఓడపల్లి వెంకన్న, తొండ

Updated Date - May 09 , 2026 | 12:18 AM