డ్రగ్స్ నిర్మూలనకు పౌరులు సైనికులుగా మారాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:30 AM
సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటి డ్రగ్ సోల్జర్ నమోదు ప్రక్రియ, డ్రగ్స్ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. మత్తు పదార్థాల నివారణ ప్రతఒక్కరి బాధ్యతన్నారు.
సూర్యాపేటక్రైం, జూన 22 (ఆంధ్రజ్యోతి) : సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు సైనికుడిగా మారాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటి డ్రగ్ సోల్జర్ నమోదు ప్రక్రియ, డ్రగ్స్ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. మత్తు పదార్థాల నివారణ ప్రతఒక్కరి బాధ్యతన్నారు. ప్రతీ పౌరుడు, విద్యార్థులు యాంటి డ్రగ్ సోల్జర్‌గా పేరు నమోదు చేసుకోవాలన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం, రవాణాకు సంబంధించి డయల్-100, 112, 1908లకు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ రవి, నర్సింహాచారి, డీసీఆర్‌బీ ఇనస్పెక్టర్ మగ్దుంఅలీ, ఎస్‌ఐ యాకూబ్ ఉన్నారు.
అర్జీలను తక్షణమే పరిశీలించాలి
ప్రజలు అందించే అర్జీలను పోలీస్ అధికారులు తక్షణమే పరిశీలించాలని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీ్‌సశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. భాధితులు ఇంటి నుంచి రాలేని పరిస్థితి ఉంటే ఫోనలో సమాచారం ఇచ్చినా ఇంటికి వచ్చి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అర్జీని చట్టపరిధిలో పరిష్కరించాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు.