Share News

నేటి నుంచి ‘చేయూత’ ఇంటింటి సర్వే

ABN , Publish Date - May 15 , 2026 | 12:19 AM

:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల లబ్ధిదారులు మృతిచెంది తే వారి పేరును జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. జాతీయ సామాజిక భద్రతా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద వృద్ధాప్య, వింతంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మిక, తదితర వర్గాలకు పెన్షన్లు అందిస్తోంది.

నేటి నుంచి ‘చేయూత’ ఇంటింటి సర్వే

మృతిచెందిన లబ్ధిదారుల పేర్ల తొలగింపు

సాంకేతికత వినియోగంతో లబ్ధిదారుల జీవన ధ్రువీకరణ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల లబ్ధిదారులు మృతిచెంది తే వారి పేరును జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. జాతీయ సామాజిక భద్రతా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద వృద్ధాప్య, వింతంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మిక, తదితర వర్గాలకు పెన్షన్లు అందిస్తోంది. అయితే పెన్షన్‌దారులు మృతిచెందితే వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించేందు కు ప్రత్యేక ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 15 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టనుంది.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, మునిసిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు ‘చేయూత’ లబ్ధిదారుల జాబితాతో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీల్లో వివిధ కేటగిరి ల్లో 96,425 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే వీరిలో కొంతమంది మృతిచెందినా, వారి వారసులు ఈ విషయాన్ని డీఆర్‌డీవో, మెప్మా వంటి విభాగాలకు సమాచారం అందించడం లేదు. దీంతో లబ్ధిదారుల పేరున బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము జమవుతుండగా, వారి వారసులు ఏటీఎం ద్వారా నగదును ఉపసంహరించుకుంటున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగం అవుతున్నట్టు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి రావడంలో ఆధునిక శాస్త్ర, సాంకేతికతను వినియోగించి లబ్ధిదారులు జీవించి ఉన్నట్టు లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ను అప్‌లోడ్‌ చేయనున్నారు.

అనర్హులకు లబ్ధిచేకూరకుండా..

మృతిచెందిన లబ్ధిదారుల పేరుతో ‘చేయూ త’ పెన్షన్ల సొమ్ము దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల వివరాలను ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో నమోదు చేస్తారు. జీవించి ఉన్న లబ్ధిదారులను లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ (జీవన ధ్రువీకరణ) నమోదు చేస్తారు. దీంతో జాబితాలో ప్రస్తుతం ఉన్న చేయూత లబ్ధిదారుల్లో మరణించిన వ్యక్తులను గుర్తించి తొలగిస్తారు. ఈ తొలగింపు కంటే ముందు మరణించిన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సభ ల్లో ప్రకటించి వాస్తవాలను నిర్ధారించుకుంటారు. గ్రామ సభ ఆమోదం ప్రకారం జీవిం చి ఉన్న లబ్ధిదారులకు ‘చేయూత’ పెన్షన్‌ యథావిధిగా కొనసాగనుండగా, మరణించిన లబ్ధిదారుల పేరుతో నిధుల దుర్వినియోగానికి చెక్‌ పడనుందని ప్రభుత్వం భావిస్తోంది.

లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ సహాయంతో

పేద వర్గాలకు చేయూత కోసం అందిస్తున్న సామాజిక భద్రత పెన్షన్లలో అనర్హులను తొలగించేందుకు శాస్త్ర, సాంకేతికతను వినియోగించి ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మునిసిపల్‌ పరిపాలన, పట్టణ అభివృద్ధిశాఖ ద్వారా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మరణించిన లబ్ధిదారులను గుర్తించి, తొలగించడమే గాక, వాస్తవ లబ్ధిదారుల వివరాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సంయుక్తంగా టీజీ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ఫేస్‌ రికగ్నైజేషన్‌ చేయనుంది. ఆధార్‌ అథెంటికేషన్‌ ద్వారా కోర్‌ బ్యాంకింగ్‌ సర్వీసె్‌సను ఉపయోగించి ‘చేయూత’ లబ్ధిదారుల లైవ్‌ అథెంటికేషన్‌ నమోదుచేసే బాధ్యతలను క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించారు.

జిల్లాలో ‘చేయూత’ లబ్ధిదారులు 96,425 మంది...

జిల్లాలో జాతీయ సామాజిక భద్రతా పథకం ‘చేయూ త’ కింద వివిధ కేటగిరీలకు చెందిన 96,425 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలతో పాటు మొత్తం తొమ్మిది కేటగిరీలకు చెందిన లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 35,419 మంది, వింతంతు 35,908, దివ్యాంగ 12,435, గీత కార్మికులు 5,547, చేనేత కార్మికు లు 3006, పైలేరియా వ్యాధిగ్రస్థులు 500, మూత్ర పిండాల డయాలసిస్‌ రోగులు 221, ఒంటరి మహిళలు 2,473, బీడీ కార్మికులు 915 మంది ఉన్నారు. అయితే ఈ ఫించన్ల పంపిణీ విధానంలో పారదర్శకత పాటించి, స్వయంగా లబ్ధిదారులకే సొమ్ము చెందాలనే దృక్పథంతో పంచాయతీలు, మునిసిపల్‌, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేపట్టారు. ఆ తర్వాత బయోమెట్రిక్‌ విధానం అమలు చేశారు. క్రమంగా బ్యాంకు ఖాతాల ద్వారా డీబీటీ విధానం అమలు చేస్తున్నారు. అయినా, మరణించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ నగదు జమ అవుతుండటాన్ని గుర్తించారు. దీంతో జీవించి ఉన్న లబ్ధిదారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టి ఫేస్‌ రికగ్నైజేషన్‌ నమోదు చేసి లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

Updated Date - May 15 , 2026 | 12:20 AM