Share News

మండే ఎండలో జనగణన

ABN , Publish Date - May 15 , 2026 | 12:23 AM

ఉపాధ్యాయులంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నారు. మండు వేసవి ఎండలో ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బడిబాట కార్యక్రమ షెడ్యూల్‌ను విడుదలచేసింది. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు జనగణన విధులు నిర్వహిస్తుండగా, బడిబాటలో ఎలా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

మండే ఎండలో జనగణన

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు

బడి బాట సాగేదెలా?

(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట అర్బన్‌) : ఉపాధ్యాయులంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నారు. మండు వేసవి ఎండలో ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బడిబాట కార్యక్రమ షెడ్యూల్‌ను విడుదలచేసింది. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు జనగణన విధులు నిర్వహిస్తుండగా, బడిబాటలో ఎలా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో బాగంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. గతంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రారంభాని కంటే రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రారంభించి జూన్‌ 15వ తేదీ వరకు కొనసాగించేంది. ఈ ఏడాది విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం నుంచే బడిబాట ప్రారంభించి విడతల వారీగా జూన్‌ 19 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించింది. 90శాతం ఉపాధ్యాయులు జనగణన విధుల్లో ఉన్నారు. 36 ప్రశ్నలతో కూడిన జనగణన వివరాలను ఇంటింటికీ తిరిగి నమోదుచేస్తున్నారు. దీనికితోడు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో బడిబాట కొనసాగించడంపై ఉపాధ్యాయులు తర్జనబర్జన పడుతున్నారు.

నెల రోజుల పాటు జనగణన

జనగణన విధులను ఉపాధ్యాయులు నెలరోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయుల్లో అయోమ యం నెలకొంది. విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు జనగణనే సవాల్‌గా మా రిందంటే అదే సమయంలో బడిబాట కార్యక్రమంలో ఎలా పాల్గొనాలని ఉపాధ్యాయు లు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది జనగణన విధుల్లో పాల్గొంటుండగా, మరో 2శాతం మంది ఉపాధ్యాయులను అదనంగా విధులకు కేటాయించారు. ఇటు జనగణన, అటు బడిబాట కార్యక్రమంలో ఏకకాలంలో ఎలా పాల్గొనాలో అర్థం కావడంలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యావారోత్సవాల్లో బడిబాట షెడ్యుల్‌

‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగం గా విద్యావారోత్సవాల పేరుతో జూన్‌ 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించేలా విద్యాశాఖ షెడ్యూల్‌ రూపొందించింది. ఈ నెల 14న ప్రారంభమైన బడిబాటలో ఉపాధ్యాయులంతా పాఠశాలలకు వెళ్లి, పాఠశాలలను అలంకరించి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి ఈ నెల 21న అంగన్‌వాడీ టీచర్లు, మదర్స్‌ కమిటీలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. 28వ తేదీన యువత, స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలి. జూన్‌ 3న గ్రామ సభ, 4న అవగాహన ర్యాలీ, 5న పిల్లలను గుర్తించడం, 6న బడి బయట పిల్లలను గుర్తించడం, 8న నుం చి 10వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం, జూన్‌ 12న వెల్‌ కండే కార్యక్రమం, 15న సామూహిక అక్షరభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎన్‌ డే, 17న గర్ల్‌ చైల్డ్‌ ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌డే, 18న డిజిటల్‌ అవేర్న్‌సడే, 19న స్పోర్ట్స్‌డే కార్యక్రమంతో బడిబాట ముగియనుంది.

హెచ్‌ఎంలపై భారం

ఈ ఏడాది బడిబాట కార్యక్రమం ప్రధానోపాధ్యాయులకు నెత్తిమీద గుదిబండలా మారింది. ఇప్పటికే జనగణనలో ఉన్న ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమంలో ఎలా భాగస్వాములు చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు విధులు నిర్వహించడమంటే వారి నుంచి ఎలాంటి ఆక్షేపణలు ఎదురవుతాయోనని హెచ్‌ఎంలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలాగైనా బడిబాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉపాధ్యాయులకు ఇప్పటికే హెచ్‌ఎంలు సమాచారం అందించారు. ఉపాధ్యాయుల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన బడిబాట లక్ష్యాలను చేరలేమనే కారణంతో ఏం చేయాలో అర్థంగాక పాఠశాలల ప్రధానోపాధాయులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించాలి: అశోక్‌, డీఈవో

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలను ఉపాధ్యాయులు నిర్వహించాలి. జనగణనతో పాటు బడిబాట కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. రోజువారీగా సమయం చూసుకొని రెండింటికీ న్యాయం చేయాలి.

Updated Date - May 15 , 2026 | 12:23 AM