Share News

బస్సుల రాకపోకలకు తొలగనున్న ఇక్కట్లు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:30 AM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌లో ఆర్టీసీ బస్‌ స్టేషన ఎదురుగా వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటుకు ఎనహెచఏఐ అధికారులు అంగీకరించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

బస్సుల రాకపోకలకు తొలగనున్న ఇక్కట్లు
చౌటుప్పల్‌లోని హైవే పై అండర్‌ పాస్‌ ఏర్పాటు చేసే ప్రాంతం

బస్‌స్టేషన సమీపంలో అండర్‌పాస్‌కు ఎనహెచఏఐ అంగీకారం

పట్టణ పరిసర ప్రాంత ప్రజల్లో సర్వత్రా హర్షం

(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్‌ టౌన): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌లో ఆర్టీసీ బస్‌ స్టేషన ఎదురుగా వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటుకు ఎనహెచఏఐ అధికారులు అంగీకరించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇందుకు సంబందించి బస్‌ స్టేషన ఎదురుగా 20 మీటర్ల వెడల్పుతో అండర్‌ పాస్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ఎనహెచఏఐ అధికారులు గురువారం 20 మీటర్ల వెడల్పుతో మార్కింగ్‌ చేశారు. ఇందు కోసం ఉద్యమాలను సాగించిన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు సంబందిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనహెచ 65పై చౌటుప్పల్‌లో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ఊపందుకుంకుటున్న తరుణంలో బస్‌స్టేషనలోకి బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఎదురయ్యింది. ఈ తరుణంలో ఆర్టీసీ బస్‌ స్టేషనలోకి బస్సులతో పాటు ఇతర వాహనాలు వెళ్లేందుకు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ప్రజలనుంచి వినిపిచింది. దీనికి అనుగుణంగా మునిసిపల్‌ చైర్‌పర్సన మొగుదాల పావనీరమే్‌షగౌడ్‌ స్పందించి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబందించి ఈ నెల 9వ తేదీన మునిసిపాలిటీ కార్యాలయంలో ఎనహెచఏఐ అధికారి భూపతి బృందంతో చైర్‌ పర్సన పావని సమీక్ష నిర్వహించి బస్‌ స్టేషన ఎదుట అండర్‌ పాస్‌ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. అండర్‌ పాస్‌ లేని పక్షంలో బస్‌ స్టేషన లోకి బస్‌ లు సక్రమంగా వెళ్లలేని పరిస్థితి ఉంటుందని, రాంగ్‌ రూట్లలో బస్‌ లు వెళ్ల వలసి వస్తుందని పావని తెలిపారు. అదే విదంగా పాదచారులు రోడ్డు దాటేందుకు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని, చౌటుప్పల్‌ పట్టణ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని అధికారులకు పావని వివరించారు. ఈ సమస్యను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దృష్టికి పావని తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21 వ తేదీన హైవేపై జరుగుతున్న ప్లై ఓవర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. బస్‌ స్టేషన ఎదుట అండర్‌ పాస్‌ ప్రాముఖ్యతను ఎమ్మెల్యేకు చైర్‌ పర్సన పావని వివరించారు. స్థానిక సమస్యలను పరిగణలోకి తీసుకుని బస్‌ స్టేషన ఎదుట అండర్‌ పాస్‌ను ఏర్పాటు చేయాలని ఎనహెచఏఐ రీజనల్‌ ఆఫీసర్‌ శివశంకర్‌, పీడీ శ్రీనివా్‌సరావులకు ఎమ్మెల్యే సూచించారు. అదే విదంగా అండర్‌ పాస్‌ ఏర్పాటుకు సంబందించి బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి లు సైతం ఎనహెచఏఐ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్లై ఓవర్‌ నిర్మాణ ప్రాంతంలోని హైవే పై ధ ర్నాలు కూడ చేశారు. వామపక్షాలు కూడా బీఆర్‌ఎస్‌, బీజేపీలతో ఏకీభవించాయి. సమస్యను తీవ్రతరం చేయడంతో ఎనహెచఏఐ అధికారులు దిగిరాక తప్పలేదు. అండర్‌ పాస్‌ ఏర్పాటుకు 20 మీటర్ల వెడల్పు, 5.5 మీటర్ల ఎత్తుతో మార్కింగ్‌ చేయడంతో సమస్య సద్దుమణిగింది.

బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన ఎదుట హైవేపై అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి నితిన గడ్కరీ, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి చిత్రపటాలకు బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ చేసిన ఉద్యమాలతోనే అండర్‌పాస్‌ ఏర్పాటు జరుగుతోందని వారు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు కడారి కల్పన, కైరంకొండ అశోక్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు దూడల బిక్షం గౌడ్‌, కౌన్సిలర్‌ బుడ్డ సురేష్‌, ఆలె చిరంజీవి, నాయకులు జి.సురేందర్‌రెడ్డి, పి.శ్రీధర్‌బాబు, దిండు భాస్కర్‌, కంది లక్ష్మారెడ్డి, వి.భాను తదితరులు పాల్గొన్నారు.

అండర్‌ పాస్‌ ఏర్పాటు హర్షణీయం

మొగుదాల పావని, మునిసిపల్‌ చైర్‌ పర్సన

చౌటుప్పల్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్‌ స్టేషన ఎదురుగా హైవే పై 20 మీటర్ల వెడల్పుతో అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయడం హర్షణీయం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుని ఎనహెచఏఐ అధికారులపై ఒత్తిడి తెచ్చి అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. అండర్‌ పాస్‌ ఏర్పాటుతో ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. బస్సుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Updated Date - Apr 24 , 2026 | 12:30 AM