నిర్మించారు..వదిలేశారు..
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:24 AM
(ఆంధ్రజ్యోతి-మఠంపల్లి) మండలంలోని యాతవాకిళ్ల గ్రా మం లో గత పాలక ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కంపచెట్లు పెరిగిఅధ్వానంగా మారా యి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పడక గదులు ఏడేళ్లుగా పంపిణీకి నోచుకోలేదు.
త్వరగా పంపిణీ చేయాలని లబ్ధిదారుల వేడుకోలు
(ఆంధ్రజ్యోతి-మఠంపల్లి)
మండలంలోని యాతవాకిళ్ల గ్రా మం లో గత పాలక ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కంపచెట్లు పెరిగిఅధ్వానంగా మారా యి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పడక గదులు ఏడేళ్లుగా పంపిణీకి నోచుకోలేదు. అధికారులు లాటరీ పద్ధ్దతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. జాబితాతో పాటు పట్టాలు సిద్ధం చేసినా వాటిని పంపిణీ చేయడంలో ఎడతెగని నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక
గత ప్రభుత్వం సుమారు రూ.1.20 కోట్లతో గ్రామంలో 20 ఇళ్లను నిర్మించారు. 2022లో పూర్తయిన ఇళ్ల కోసం యాతవాకిళ్లతో పాటు చెర్వువారితండాలకు చెందిన 230 మంది తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసు కున్నారు. పర్యవేక్షణలో చేసుకున్నారు. దరఖాస్తులను రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్ అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తిచేందు కు ఇంటింటి సర్వే చేపట్టారు. తొలి జాబితా కోసం 2023 ఆగస్టులో లాటరీ పద్ధ్దతిలో 20 ఇళ్లకు 29మందిని ఎంపిక చేశారు. లాటరీ పద్ధ్దతిలో అర్హులను గుర్తించిన అధికారులు 20మందికి ఇళ్లు మరో 9మందికి స్థలాలు ఇచ్చేందుకు గ్రామసభ ద్వారా నిర్ణయించారు. సర్వే చేసి న వాటిలో ఆశవాహుల సంఖ్య అధికంగా ఉండటంతో దరఖాస్తు దారులలో మరో 63 మందికి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 82లో స్థలాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం 92మందిని గుర్తించిన రెవెన్యూ అధికారులు 18 నెలలుగా వారికి ఇంటి స్థలాలు కేటాయింపు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రసుత్తం ఇందిరమ్మ సర్వే జరుగుతోందని స్థలాలు కేటాయిస్తే ఇళ్లు మం జూరు చేయించుకుంటామని లబ్ధిదారులు అధికారులను వేడుకుంటున్నారు. స్థలాలు, ఇల్లు లేకుండా కాలం వెల్లదీస్తున్న తమకు ఆదుకోవాలని లబ్ధ్దిదారులు కోరుతున్నారు.