అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగు
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:45 PM
వలిగొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తాను చనిపోతూ పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన యువకుడు.
వలిగొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తాను చనిపోతూ పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన యువకుడు. గ్రామానికి చెందిన గోపగాని వెంకటేశం భాగ్యమ్మ, పెద్దకుమారుడు మధు (23) డిగ్రీ పూర్తి చేసి. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చాడు. ఈనెల 21న వలిగొండకు వచ్చి ఓ బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఆ గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు తలకు బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద యఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతుండగా 28న మధు బ్రెయిన డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవనదాన సంస్థ బృందం అవయవదానం గురించి యువకుడి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. మధు శరీరం నుంచి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేశారు. తండ్రి వెంకటేశం ఆటో డ్రైవర్‌గా, తల్లి భాగ్యమ్మ కూలీ పనులు చేస్తూ కుమారుడిని చదివించి ప్రయోజకుడిని చేశారు. చేతికి అందొచ్చిన కుమారుడు తమ కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. మధు మృ తితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి.