Share News

పది విద్యార్థులకు అల్పాహారం

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:46 AM

విద్యా రంగంలో ఉన్నత ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగా ప్రతేక్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అర్ధాకలితో ఇంతకాలం వెళ్లదీశారు.

పది విద్యార్థులకు అల్పాహారం

నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పరీక్షలు, ప్రత్యేక తరగతుల నేపథ్యంలో నిర్ణయం

మార్చి 10వ తేదీ వరకు కార్యక్రమం

ఉమ్మడి జిల్లాకు రూ.37.57కోట్లు

(ఆంధ్రజ్యోతి,అడ్డగూడూరు): విద్యా రంగంలో ఉన్నత ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే లక్ష్యంగా ప్రతేక్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అర్ధాకలితో ఇంతకాలం వెళ్లదీశారు. ఈ ప్రభావం పరీక్ష ఫలితాలపై పడుతుందని గుర్తించిన ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ఆల్పాహారం అందించేందుకు నిర్ణయించింది. పదోతరగతి విద్యార్థులకు ఈ నెల 16వ తేదీ నుంచే అల్పాహారం అందించేందుకు నిధులు విడుదలచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాహారాన్ని మార్చి 10వ తేదీ వరకు అంటే పాఠశాలలు నడిచే 19 రోజులపాటు అందించనుంది. ఉదయం లేదా సాయంత్రం వేళ విద్యార్థులకు ఉడికించిన శెనగలు, పెసర్లు. బిస్కెట్లు లాం టి అల్పాహారాన్ని అందజేస్తారు. ప్రత్యేక తరగతుల్లో అందించే ఈ అల్పాహారం కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థి కి రోజుకు రూ.15 కేటాయించింది.

ఉమ్మడి జిల్లాకు రూ.37.57కోట్లు విడుదల

నల్లగొండ జిల్లాలో 216 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే పదో విద్యార్థులు 6045 మందికి ఈ ఆల్పాహారాన్ని అందజేయనున్నారు. అందుకు రోజుకు రూ.90,675 వ్య యం కానుండగా, 19 రోజులకు రూ.17,22,825 నిధులను ప్రభుత్వం కేటాయించింది. సూర్యాపేట జిల్లాలో 170 ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో చదివే 3,539 మంది విద్యార్థులకు రోజుకు రూ.53,085 వ్యయం కానుండగా, 19 రోజులకు రూ.10,08,615 నిధులను విడుదల చేసింది. యాదాద్రి జిల్లాలో 147 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 3,600 మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుండగా, రోజుకు రూ.54,000 వ్యయం కానుంది. మొత్తం 19 రోజులకు ప్రభుత్వం రూ.10,26,000 నిధులను విడుదలచేసింది. మొత్తం ఉమ్మ డి జిల్లాకు ప్రభుత్వం రూ.37,57,440 విడుదల చేసింది.

మండలంలో ఇలా..

అడ్డగూడూరు మండలంలో ఐదు జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అడ్డగూడూరులో 20మంది విద్యార్థులకు రూ.5,700, డి.రాపాకలో 9మందికి రూ.2565, ఆజీంపేటలో 12మందికి రూ.3420, చౌళ్లరామారంలో 9మందికి రూ.2565, కోటమర్తిలో 10మందికి రూ.2850 వ్యయం కానుంది. మండలంలోని మొత్తం 60మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.17,100 విడుదల చేసింది.

చదువుపై దృష్టిసారించే అవకాశం :గుండా ధనశ్రీ, పదో తరగతి విద్యార్థిని

ప్రస్తుతం రోజు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ అర్ధాకలితోనే తరగతులకు హాజరవుతున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాకు అల్పాహారం అందుతోంది. ఇకపై పూర్తిస్థాయిలో చదువుపై దృష్టిసారించే అవకాశం కల్పించింది.

నాణ్యమైన అల్పాహారం అందిస్తాం : సబిత, అడ్డగూడూరు ఎంఈవో

అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తాం. ఈ కార్యక్రమం వచ్చే నెల 10తేదీ వరకు కొనసాగుతుంది. నాణ్యమైన అల్పాహారం అందించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

Updated Date - Feb 18 , 2026 | 12:46 AM