Share News

ధాన్యం రవాణాలో.. ‘జీపీఎస్‌’ విధానానికి బ్రేక్‌

ABN , Publish Date - May 01 , 2026 | 12:14 AM

యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయింపులో ప్రభుత్వం కొత్తగా అమ ల్లోకి తెచ్చిన జీపీఎస్‌ విధానంతో పాటు ఆటో మెయిల్‌ ట్యాగ్‌ను ఉపసంహరించుకుంది. తూకం వేసి ధాన్యం మిల్లులకు రవాణా చేసిన తర్వాత మిల్లర్లు తాలు, తేమ నాణ్యత పేరిట పెడుతున్న కొర్రీలు, కోతల నుంచి రైతుల ఉపశమనం కోసం అమల్లోకి తెచ్చిన జీపీఎస్‌ విధానం నిలిచింది.

ధాన్యం రవాణాలో.. ‘జీపీఎస్‌’ విధానానికి బ్రేక్‌

పాత పద్ధతిలోనే మిల్లులకు ధాన్యం తరలింపు

యాదాద్రి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయింపులో ప్రభుత్వం కొత్తగా అమ ల్లోకి తెచ్చిన జీపీఎస్‌ విధానంతో పాటు ఆటో మెయిల్‌ ట్యాగ్‌ను ఉపసంహరించుకుంది. తూకం వేసి ధాన్యం మిల్లులకు రవాణా చేసిన తర్వాత మిల్లర్లు తాలు, తేమ నాణ్యత పేరిట పెడుతున్న కొర్రీలు, కోతల నుంచి రైతుల ఉపశమనం కోసం అమల్లోకి తెచ్చిన జీపీఎస్‌ విధానం నిలిచింది. ఈ విధానంతో తమకు గిట్టుబాటు కాదని రవాణా కాంట్రాక్టర్ల అభ్యంతరాలకు మిల్లర్లు సైతం తోడయ్యారు. ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కొనుగోలుకేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు పేరుకు పోతుండడం, కొత్తగా తూకా లు జరగకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సమస్య తీవ్రతరమవుతోందని భావించిన ప్రభుత్వం సాఫీగా ధాన్యం కొనుగోళ్లు రవాణా సమస్యలను అధిగమించడానికి కొత్తగా అమలులోకి తెచ్చిన జీపీఎస్‌ విధానంలో ఆటో మెయిల్‌ ట్యాగ్‌ను ఉపసంహరించింది. దీంతో గతంలోలా మ్యాన్‌వల్‌ పద్ధతిని కొనసాగించాలని బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

మ్యానువల్‌గానే రవాణా..

వారం రోజులుగా అమలు చేస్తున్న జీపీఎస్‌ విధానంలో మిల్లుల ఆటో మెయిల్‌ ట్యాగ్‌ విధానానికి అధికారులు స్వస్తి చెప్పడంతో గురువారం నుంచి జిల్లాలో మ్యాన్‌వల్‌గానే లార్లీల్లో ధాన్యం మిల్లులకు చేరుతోంది. ఈ విధానంలో ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ధాన్యం తూకం వేసి, ట్రక్‌షీట్‌ రూపొందించి ముందుగా కేటాయించిన మిల్లులకు లారీల్లో లోడ్‌ చేసి పంపిస్తారు. పంపిన ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు తేమ, తాలు వం టివి ఉన్నాయని మిల్లర్లు కొర్రీలు పెట్టి దిగుమతికి నిరాకరిస్తే, ఆ యా లోడ్‌లో ధాన్యం విక్రయించిన రైతులను మిల్లుల వద్దకు పం పడం, లేదా నిర్వాహకులు వారితో బేరసారాలు చేసి ధాన్యం తూ కంలో కోత విధించి, రైతులు భరించే విధంగా ఒప్పిస్తుంటారు. దిగుమతి తర్వాత మిల్లర్లు కోతల తదుపరి ధ్రువీకరించిన పరిమా ణం ప్రకారమే బిల్లులు నమోదు చెల్లింపులకు పంపిస్తుంటారు.

జీపీఎస్‌ విధానంతో ఆటో ట్యాగింగ్‌

ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణాలో జీపీఎస్‌ విధానంతో ఆటో ట్యాగింగ్‌ ప్రకారమైతే ధాన్యం బస్తాలు చేసిన బస్తాలను లారీలో లోడ్‌ చేసిన వెంటనే ఆటో ట్యాగింగ్‌ అవుతుంది. జిల్లాలో రైస్‌మిల్లుల కేటాయింపుల్లో అందుబాటులో గల మిల్లుకు ట్రక్‌షీట్‌ జనరేట్‌ చేస్తుంది. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తాము కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయగానే ధాన్యం దిగుమతి చేయాల్సిన మిల్లు లోకేషన్‌ అడుగుతుంది. దాని ప్రకారం నిర్వాహకులు తమకు అందుబాటులో గల మిల్లును ఎంపిక చేస్తారు. కేంద్రంలో నాణ్యత పరిశీలించి పంపిన తర్వాత రైస్‌ మిల్లర్‌ కొర్రీ పెట్టే అవకాశం ఉండదని రైతులు అంటున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్ముక్కై నాణ్యత ప్రమాణాల పరిశీలన, ధ్రువీకరణ తర్వాత తూకం వేసిన ధాన్యంలో కోతలు పెట్టడానికి అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ఈ విధానంలో లారీలకు దూరభారం అనే కారణంతో పాటు మిల్లుల కేటాయింపుల్లో స్పష్టత కొరవడటం, రవాణా కాంట్రాక్టర్ల అనాసక్తి కారణంగా మొత్తం కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తున్నారు. ఈ కారణంగా అధికారులు జీపీఎస్‌, ఆటో ట్యాగింగ్‌ విధానం రద్దుచేసి మ్యాన్‌వల్‌ ట్రక్‌ షీట్‌నే నిర్ణయించి గురువారం నుంచి అమలు చేస్తున్నారు.

అప్పుడు ఒప్పుకుని.. ఇప్పుడు పాత పాట

మోత్కూరు:గతంలో అంగీకరించిన మిల్లర్లు ధాన్యాం మిల్లువద్దకు వెళ్లగానే మళ్లీ పాతపాటే పాడారు. అధికారులు పట్టించుకోకపోవడం, మబ్బులతో(వర్షసూచనలతో) ఆందోళనలో కొం దరు రైతులు గురువారం రైస్‌మిల్లుల వద్దకు వెళ్లి బస్తా(40కిలోల)కు ఒక కిలో(క్వింటాకు రెండున్నర కిలోలు)చొప్పున కోతకు అంగీకరించి, వాహనాలు కూడా వారే తెచ్చుకుని మో త్కూరు మార్కెట్‌లో బస్తాలు లారీల్లోకి ఎత్తిపంపినట్టు సమాచారం.రూ.2389 ఉన్న ఏగ్రేడ్‌ధాన్యాన్ని, సాధారణ రకంగానే దిగుమతి చేసుకుంటున్నారు. ఇదిలాఉండగా జీపీఎస్‌ విధానంతో ఎదురవుతున్న ఇబ్బందులపై ధాన్యం రవాణాపై ‘జీపీఎస్‌’ ప్రభావం శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ఏప్రిల్‌ 28న వెలుగులోకి తెచ్చింది. ఏప్రిల్‌ 29న రవాణాకాంట్రాక్టర్లు వాహనాలు పంపలేదు. ఏప్రిల్‌ 29న అధికారులు పరిస్థితిని సమీక్షించి జీపీఎస్‌ విధానాన్ని రద్దు చేశారు.

Updated Date - May 01 , 2026 | 12:14 AM