రేపటి నుంచి మత్స్యగిరీశుడి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:14 AM
వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి నవంబరు 24 వరకు నిర్వహించన్నుట్లు ఆలయ చైర్మమన తుమ్మల శ్రీనివాస్ తెలిపారు.
వలిగొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి నవంబరు 24 వరకు నిర్వహించన్నుట్లు ఆలయ చైర్మమన తుమ్మల శ్రీనివాస్ తెలిపారు. 19న గురువారం శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురార్పన, గరుడ ధ్వజాదివాసం, నవంబరు 20 శుక్రవారం రోజున గరుడ ధ్వజప్రతిష్ట శేష వాహన సేవ, ధ్వజారోహనము, బలి ప్రదానము, బేరీ తాండవము, దేవతాహ్వానం హోమం, నవంబరు 21 శనివారం రోజున యాగశాల ద్వారతోరణార్చన, చతుస్థానార్చన, హోమం, హన్మంతు వాహన సేవ, బలిప్రదానం, ఉత్సవమూర్తులకు స్నపనం, తీర్థప్రసాద గోష్ఠి, నవంబరు 22 ఆదివారం రోజున ఉదయం 11గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. నవంబరు 23 సోమవారం రోజున యాగశాల ద్వార తోరణార్చన, శ్రీ సుదర్శన నారసింహ ఇష్టి, చతుస్థానార్చన, హోమం, ఉత్సవమూర్తులకు స్వపనము, మూర్తిమంత్ర హోమం, నవంబరు 24 మంగళవారం మహాపూర్ణాహుతి, గరుడ వాహన సేవ, చక్రతీర్థము అలంకారము, దేవతోద్వాసనము, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజావరోహనము, మూకబలి ప్రధానం,ఆచార్యాది సన్మానం, ఉత్సవ పరిసమాప్తి వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా లక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులకు పాలకమండలి కమిటీ, అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి : ఈవో
శ్రీమత్స్యగిరి లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రానందంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేశాం. చలువ పందిళ్లు, మంచినీరు, శామియాలు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాం.