Share News

బోనాలు, వాహన ప్రదక్షిణలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:21 AM

యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులో ఉగాది పండుగను విభిన్న రీతిలో జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం బోనం వండి, గురువారం బోనం కుండలను అలంకరించి ముత్యాలమ్మ గ్రామదేవతలకు చలిబోనం నైద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.

బోనాలు, వాహన ప్రదక్షిణలు
మోత్కూరు ఉన్నత పాఠశాలలో ఎడ్ల బండ్లు, వాహనాలు తిప్పుతున్న రైతులు, వాహనదారులు

మోత్కూరులో వినూత్నంగా ఉగాది వేడుకలు

మోత్కూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులో ఉగాది పండుగను విభిన్న రీతిలో జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం బోనం వండి, గురువారం బోనం కుండలను అలంకరించి ముత్యాలమ్మ గ్రామదేవతలకు చలిబోనం నైద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. రైతులు ఎడ్లబండ్లను, వాహనాదారులు ట్రాక్టర్‌, డీసీఎం, లారీ, ఆటో, బైక్‌ తదితర వాహనాలను అలంకరించి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదక్షణగా పరుగులు పెట్టించారు. దసరా, సంక్రాంతికి పండుగలకన్నా మోత్కూరులో ఉగాది పండుగనే వైభవంగా నిర్వహించడం విశేషం. ఇదిలా ఉండగా కుర్రకారు అత్యుత్సాహం కాస్తా ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయానికి గండికొట్టింది. బోనాల చుట్టూ తిప్పాల్సిన ఎడ్లబండ్లు, వాహనాలను బోనాలు లేకుండానే తిప్పారు. సాయంత్రం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పంచాంగ శ్రవణం జరిగింది.

Updated Date - Mar 20 , 2026 | 12:21 AM