Share News

మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం!

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:41 AM

వారం రోజుల క్రితం గుర్రంపోడు మండలంలోని ఓ గ్రామంలోని ఫారంలో 1,000 కోళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి. కోళ్లు చనిపోవడంతో సదరు పౌలీ్ట్ర రైతు ఆం దోళనకు గురయ్యాడు. ఆర్థికంగా నష్టపోయానని అత డు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం!

వారం క్రితం గుర్రంపోడులోమృతిచెందిన కోళ్లు

సరిహద్దు జిల్లాలోనూ పెరిగిన వ్యాధి

ఏపీకి కోళ్లను తీసుకెళ్తున్న వ్యాపారులు

నాటుకోళ్లకు సైతం కొక్కెర రోగం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వారం రోజుల క్రితం గుర్రంపోడు మండలంలోని ఓ గ్రామంలోని ఫారంలో 1,000 కోళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి. కోళ్లు చనిపోవడంతో సదరు పౌలీ్ట్ర రైతు ఆం దోళనకు గురయ్యాడు. ఆర్థికంగా నష్టపోయానని అత డు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే కోళ్లకు బర్డ్‌ఫ్లూ నా? లేక ఇతర కారణాలున్నాయా? అనేది తేలాలంటే పశువైద్యాధికారులు మృతిచెందిన శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపి నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే చాలా గ్రామాలు, పట్టణాల్లో కోళ్లు మృతి చెందుతుండటంతో వా టి మరణానికి బర్డ్‌ఫ్లూనే కారణమని వదంతులు వేగంగా వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొన్ని కోళ్ల ఫారాల్లో కోళ్లు మృతి చెందుతుండటంతో పౌలీ్ట్ర రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. సంబంధిత రైతులు ఇప్పటి వరకు ఈ విషయాన్ని పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. జిల్లా సరిహద్దులోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో 10వేలకు పైగా కోళ్లు ఈ రెండు రోజుల్లోనే మృత్యువాతపడ్డా యి. దీంతో జిల్లాకూ ఈ వైరస్‌ సోకిందని, అందుకే గుర్రంపోడు గ్రామంలో కోళ్లు మృతిచెందాయని రైతులు భావిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ఏపీ రాష్ట్రంలోని జిల్లాలో కూడా ఈ వైరస్‌ ప్రభావం ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా జిల్లాలో స్కిన్‌లె్‌స చికెన్‌ కిలో ధర రూ.294 ఉండగా, స్కిన్‌తో చికెన్‌ ధర రూ.260 నుంచి రూ.270 వరకు ఉంది. అయి తే చికెన్‌ ధరలు అమాంతం పెరిగేందుకు కోళ్ల ఉత్పత్తులు తగ్గడమే గాక పలు చోట్ల బర్డ్‌ప్లూతో చనిపోతుండటంతో జిల్లాకు దిగుమతి తగ్గింది. నిం డు వేసవి రాకముందే కోడి మాంసం ధర అనూహ్యంగా పెరగింది. దీనికి వాస్తవ పరిస్థితులు ఏమిటనేది ఇంకా ఓ అంచనాకు రాలేక పోతున్నారు. హోల్‌సేల్‌తో పాటు రిటైల్‌ వ్యాపారులు కోళ్లను పంపిణీ చేస్తున్నా వ్యాపారులు ఇస్తున్న ధరకు కొద్దిగా పెంచి విక్రయిస్తున్నారు తప్ప లాభం లేదని చికెన్‌ దుకాణదారులు పేర్కొంటున్నారు. దిగుమతి ఎందుకు తగ్గిందనే కారణాలు తమకు తెలియదని చికెన్‌ దుకాణదారులు పేర్కొంటున్నారు.

ఏపీకి కోళ్లను తీసుకెళ్తున్న వ్యాపారులు

జిల్లాలో ప్రస్తుతం కోళ్లకు బర్డ్‌ఫ్లూ పూర్తిస్థాయి లో విస్తరించకున్నా జిల్లాలోని పలు ప్రాంతా ల్లో బర్డ్‌ఫ్లూ విస్తరించిందనే వదంతులు వినవస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద మొత్తంలో బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో అక్కడి అధికారులు విషయాన్ని ప్రకటించకుండా వాటిని గుంతలు తీసి పూడ్చిపెడుతున్నారని తెలుస్తోంది. అసలు విషయా న్ని అక్కడి అధికారులు పొక్కనివ్వడం లేదని సమాచారం. ఇదిలా ఉంటే ఏపీలోని సరిహద్దు జిల్లా వ్యాపారులు నల్లగొండ జిల్లాకు వచ్చి పెద్ద మొత్తంలో కోళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నా రు. ఈ ప్రభావం జిల్లాలో చికెన్‌ ధర పెరగడానికి కారణంగా తెలుస్తోంది. చికెన్‌ ధర పెరుగుతుండటంతో మాంసం ప్రియులపై ఆర్థిక భారం పడుతోంది. కొద్ది రోజుల వరకు కోడి గుడ్డు ధర రూ.8 వరకు పలికింది. తాజాగా చికెన్‌ ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50లక్షలకు పైగా కోళ్లు ఉన్నట్లు అధికారుల అంచనా. పౌలీ్ట్ర ఫారాల్లో యజమానులు అప్రమత్తంకాకపోతే కోళ్లు పెద్ద మొత్తంలో చనిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఫారాల యజమానులు శానిటేషన్‌ చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని సంప్రందించి బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టకపోతే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

నాటు కోళ్లకు కొక్కెర వ్యాధి

బ్రాయిలర్‌ కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిందనే వార్తలు ఇలా ఉండగా, నాటుకోళ్లకు కొక్కెర వ్యాఽధి సోకుతోంది. నల్లగొండ మండలంలో గత నెలాఖరులో వందల సంఖ్యలో నాటుకోళ్లు కొక్కెర వ్యాధితో మృతిచెందాయి. అప్పాజిపేట, ఖాజీరామారం, కేశరాజుపల్లిలో కొక్కెర వ్యాధితో కోళ్లకు ముక్కు, కళ్ల నుంచి నీరుకారి వ్యాధి ప్రభావానికి గురై చనిపోయాయి. నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్‌రోడ్డులో 10 రోజుల క్రితం కొక్కర వ్యాధిసోకి కోళ్లు చనిపోయాయి. నాటుకోడి కోడి రూ.650 నుంచి రూ.700 వరకు ధర పలుకుతోంది. నాటుకోళ్లంటూ రంగుల కోళ్లు మార్కెట్‌కు వస్తుండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. అసలు నాటు కోళ్లను గుర్తించడం కష్టంగా మారుతోంది. కొన్ని నెలలుగా నాటుకోళ్ల రూపంలో ఉన్న రంగుల కోళ్లను రూ.300 చొప్పున విక్రయిస్తుండటంతో మాంసం ప్రియులు వాటిని అసలు కోడిగానే భావించి పలువురు కొనుగోలు చేసి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి బాయిలర్‌ కోళ్లతో పాటు నాటు కోళ్లలో వస్తున్న వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నాటుకోళ్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది.

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లేదు : డాక్టర్‌ రమేష్‌, పశుసంవర్ధకశాఖ అధికారి

జిల్లాలో ఎక్కడా బర్డ్‌ప్లూ వ్యాధి సోకలేదు. ఏ గ్రామం నుం చి కూడా బర్డ్‌ప్లూ వ్యాధి సోకి కోళ్లు చనిపోయినట్లు ఫిర్యాదు రాలేదు. కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి. ఎక్కడా బ్రాయిలర్‌ కోళ్లు చనిపోలేదు. నాటు కోళ్లకు కొక్కెర వ్యాధి వచ్చినట్లు కూడా దృష్టికి రాలేదు. ఎక్కడైనా కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉంటే శాంపిళ్లను సేకరించేందుకు వెళ్తాం. వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Mar 10 , 2026 | 12:41 AM