Share News

జాతీయస్థాయి జూడో పోటీలకు బీబీనగర్‌ విద్యార్థిని

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:08 AM

బీబీనగర్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ పట్టణానికి చెందిన నెల్లుట్ల భవిష్య జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎం పికైంది.

జాతీయస్థాయి జూడో పోటీలకు బీబీనగర్‌ విద్యార్థిని

బీబీనగర్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి) : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ పట్టణానికి చెందిన నెల్లుట్ల భవిష్య జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎం పికైంది. మండల కేంద్రంలోని కిడ్స్‌కింగ్‌డమ్‌ గ్రామర్‌ హైస్కూల్‌కు చెందిన భవిష్య ఈనెల 14,15 తేదీల్లో ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో గోల్డ్‌మోడల్‌ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలో డిసెంబర్‌ 12నుంచి 16వరకు జరగనున్న జాతీయ స్థాయి జూడో పోటీల్లోఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జూడో అసొసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌ యాదవ్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు ఎస్‌కే పర్వేజ్‌, జిల్లా జూడో అధ్యక్షుడు బ్రహ్మంతో పాటు హైస్కూల్‌ కరస్పాండెంట్‌ కేవీ మధుసూదన్‌ రెడ్డి అభినందించారు.

మోత్కూరు విద్యార్థికి రజత పతకం

మోత్కూరు : ఖమ్మం జిల్లాలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో మోత్కూరు కరాటే క్లబ్‌ చెందిన విద్యార్థిని ఎ.సాన్విక ప్రతిభ చూపారు. 28 కిలోల బరువు విభాగంలో రజతపతకం సాధించిందని సీనియర్‌ జూడో కోచ్‌ అన్నెపువెంకట్‌ తెలిపారు. సీహెచ్‌.వీణ,వి.సాయి సుజిత్‌చంద్ర, ఎండి.అబ్దుల్‌ రహమాన్‌ ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సోమవారం వారిని జోడో ఫౌండర్‌ పి.బాలరాజు, సీనియర్‌ కోచ్‌ వెంకట్‌, ఇన్‌స్ట్రక్టర్లు బి.కార్తీక్‌, పి.మచ్చేందర్‌, మత్స్యగిరి అభినందించారు.

Updated Date - Nov 17 , 2026 | 12:09 AM