Share News

రైతుభరోసాకు భూభారతి ప్రామాణికం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:24 AM

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసాకు పూర్తిగా భూభారతి పోర్టల్‌ను ఆధారంగా తీసుకోవాలని నిర్ణయించింది.

రైతుభరోసాకు భూభారతి ప్రామాణికం

ఫిబ్రవరి 28 వరకు పోర్టల్‌లో నమోదైన వారందరికీ సాయం

ఉమ్మడి జిల్లాలో సాంకేతిక కారణాలతో భరోసా దక్కని రైతులు 1.05లక్షల మంది

కొత్త పట్టాదారులతో పాటు పెండింగ్‌ ఖాతాల రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

- (ఆంధ్రజ్యోతి,నల్లగొండ): యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసాకు పూర్తిగా భూభారతి పోర్టల్‌ను ఆధారంగా తీసుకోవాలని నిర్ణయించింది. అదేవిధంగా ఏ రైతు కూడా పెట్టుబడి సాయానికి దూరంకాకుండా ఉండేందు కు కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు పొందిన వారితోపాటు, గతంలో పలు సాం కేతిక కారణాలతో రైతు భరోసాను పొందలేకపోయిన వారి నుంచి దరఖాస్తు లు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

రైతు భరోసాకు ప్రభుత్వం భూభారతిని ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు భూభారతిలో నమోదై పట్టాలతో పాటు, ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ పట్టాదారులకు కూడా రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భూభారతి పోర్టల్‌ను ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించిన నేపథ్యంలో అందులో నమోదైన పట్టాలను ఆధారంగా చేసుకొని రైతు భరోసా అమలు చేయనుంది. ఈ ఏడాది యాసంగి సీజన్‌ ముగుస్తుండగా, రైతు భరోసా ఆలస్యమైన నేపథ్యంలో రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, ప్రతిపక్షాలు రైతు భరోసాపై ప్రశ్నించే అవకాశాలు ఉండటంతో, ఈనెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా రైతాంగం ఊరట కలిగినట్టయింది. రైతు భరోసాను మూడు విడతల్లో ప్రతీ రైతుకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

రైతు భరోసా దక్కని వారు 1.05లక్షల మంది

వివిధ సాంకేతిక కారణాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,05,984 మంది రైతులకు రైతు భరోసా దక్కలేదు. దీంతో వారందరికీ రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను తీసుకుంటోంది. జిల్లాలో 51,398 మంది రైతులు, సూర్యాపేట జిలా ్లలో 18,049 మంది, యాదాద్రి జిల్లాలో 36,537 మంది రైతులకు రైతు భరోసా అందలేదు. ఈ నెల 25లోగా సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు, మొబైల్‌ నెంబరు సరిచేయ డం, ఇతర సమస్యలను పరిష్కరించి వారికి ఈ సీజన్‌లో రైతు భరోసా వచ్చేలా అధికారులు చర్య లు తీసుకోనున్నారు. డీబీటీ వైఫల్యాల కారణంగా గత సీజన్‌లో పెట్టుబడి సాయం అంద ని రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 25 లోపు ఆన్‌లైన్‌ చేస్తారు. జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో ఏఈవోలు, ఎంఏవోలు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి దరఖాస్తులను తీసుకొని ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయనున్నారు.

ఉమ్మడి జిల్లాలో 10.69లక్షల ఖాతాలు అప్‌డేట్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,69,067మంది రైతులు పెట్టుబడి సాయం లబ్ధిదారులుగా ఉన్నారు. అందులో జిల్లాలో 5,27,366 మంది రైతులకు సంబంధించిన ఖాతాలు సక్రమంగా ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు ట్రెజరీకి అప్‌డేట్‌ చేశారు 51,398 మంది రైతులకు ఖాతాలు సక్రమంగా లేకపోవడంతో సాంకేతిక కారణాలతో గత సీజన్‌లో రైతు భరోసా దక్కలేదు. సూర్యాపేట జిల్లాలో 3,06,766 మంది రైతులు ఉండగా 2,88,717 లక్షల ఖాతాలు అప్‌డేట్‌ చేయగా, 18,049 మంది రైతుల ఖాతాలు సవరించాల్సి ఉంది. యాద్రాది జిల్లాలో 2,89,521 మంది రైతులు ఉండగా 2,52,984 ఖాతాలు అప్‌డేట్‌ చేసి ట్రెజరీకి పంపారు. ఇంకా 36,537 ఖాతాలను సవరించాల్సి ఉన్న నేపథ్యంలో వారందరి నుంచి దరఖాస్తులు తీసుకొని ఈనెల 25లోగా అప్‌డేట్‌ చేసి రెండో విడతలో రైతు భరోసా అందించనున్నారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా 20,568మంది రైతులు కొద్దిరోజులుగా భూములు కొనుగోలు చేసి ఫిబ్రవరి 28 వరకు భూభారతిలో నమోదై ఉన్నారు. వీరందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకొని ఈ సీజన్లో రైతు భరోసా జమ చేయనున్నారు. ప్రింటింగ్‌ సమస్యతో పాస్‌పుస్తకాలు లేకుండా ఉంటే తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన అనంతరం తీసుకున్న డిజిటల్‌ కాపీని వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలి. ఇదిలా ఉంటే ఈ నెల 22న జిల్లాలోని అందరి రైతుల బ్యాంక్‌ ఖాతాలో రూ.6వేలను జమ చేయనున్నారు. గతంలో ఎకరం నుంచి మొదలు మూడెకరాల వరకు రైతుబంధు అందజేశారు. ఈసారి జిల్లాలో ఉన్న రైతులందరికీ ఎకరం వరకు తొలుత డబ్బు జమ చేయనున్నట్టు వినికిడి. ఆ తర్వాత రెండు విడతల్లో భూమి ఎంత ఉంటే ఆ మొత్తానికి రూ.6వేల చొప్పున జమ చేయనున్నట్టు సమాచారం. జిల్లాకు రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రూ.744.64కోట్లకు పైగా నిధులను రైతు భరోసా కోసం కేటాయించింది. యాదాద్రి జిల్లాకు సుమారు రూ.328.36కోట్లకు పైగా నిధులు కేటాయించగా, సూర్యాపేట జిల్లాకు రూ.376.39కోట్ల వరకు రైతు భరోసా కోసం నిధులు కేటాయించింది. ఈ నిధులన్నీ మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమచేయనుంది.

కొత్త పట్టాదారులు దరఖాస్తు చేసుకోవాలి: పి.శ్రవణ్‌కుమార్‌, జేడీఏ

గతంలో బ్యాంకు ఖాతా నెంబర్లతో పాటు మొబైల్‌ నెంబర్లు, ఇతర సాంకేతిక కారణాలతో రైతు భరోసా అందని రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఫిబ్రవరి 28 వరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు కూడా దరఖాస్తులను ఆయా మండలాల్లో వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. అర్హత ఉన్న ప్రతీ రైతుకు రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రతీ రైతుకు రైతుభరోసా డబ్బు జమవుతుంది.

Updated Date - Mar 18 , 2026 | 12:24 AM