ముగిసిన బార్ కౌన్సిల్ నామినేష్ల గడువు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:32 AM
భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. 14 స్థానాలకు నాలుగింటికి నామినేషన్లు దాఖలుకాలేదు.
నాలుగు స్థానాలకు దాఖలుకాని నామినేషన్లు
భువనగిరి టౌన్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. 14 స్థానాలకు నాలుగింటికి నామినేషన్లు దాఖలుకాలేదు. అధ్యక్ష పదవికి కొలుపుల కమలాకర్, నిషాంగి విద్యాసాగర్, నాగారం అంజయ్య, ఉపాధ్యక్ష స్థానానికి ఎస్.శారద, ప్రధాన కార్యదర్శికి యాదగిరి, డి. జగన్‌మోహన్‌రెడ్డి, సహాయ కార్యదర్శికి యు.సురేశ్, బాల మల్లేశ్, ఎ.మల్లేశ్ నామినేషన్ దాఖలు చేశారు. సాంస్కృతిక కార్యదర్శికి ఎం.వసంత రాణి, క్రీడల కార్యదర్శి జి.శంక ర్, గ్రంథాలయ కార్యదర్శి సామ రాజేందర్‌రెడ్డి, ఐదు కార్యవర్గ సభ్య స్థానాలకు పి.ఉమాశంకర్ రావు, ఎం.రామచంద్రయ్య, పి.సౌమ్య నామినేషన్లు దాఖలు చేశారు. కోశాధికారి, మరో రెండు కార్యవర్గ సభ్యుల స్థానాలకు నామినేషన్లు రాలేదు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బార్ అసొసియేషన్ లో 30శాతం పదవులు మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేస్తూ కోశాధికారి పదవి, మహిళా ప్రతినిధి స్థానాలను వారికే కేటాయించగా, ఆ రెండింటికీ నామినేషన్లు దాఖలు కాలేదు. 16న నామినేషన్ల పరిశీలన చే యనుండగా, ఒక్కో నామినేషన్ వచ్చిన స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. 17న ఉపసంహరణ అనంతరం పోటీ ఉండే స్థానాలకు 26న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారి జిట్టా భాస్కర్‌రెడ్డి తెలిపారు.