బండి సాయిభగీరథ్‌ను అరెస్టు చేయాలి
ABN , Publish Date - May 15 , 2026 | 12:10 AM
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు.
భువనగిరి గంజ్, మే 14 (ఆంధ్రజ్యోతి) : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన రామ్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోక్సో కేసు నమోదైనప్పటికీ పోలీసులు రాజయకీయ ఒత్తిడికి అరెస్టు చేయడం లేదన్నారు. కొత్త పార్టీ పెట్టిన కవిత మాటలు బగీరథ్‌ను వెనకేసుకు వచ్చేవిధంగా ఉన్నాయన్నారు. లైంగిక దాడి ఘటనలపై బీజేపీ ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తోందన్నారు. కార్యక్ర మంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు భట్టుపల్లి అను రాధ, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, ముత్యాలు, బందదరి ఎల్లయ్య, వెంక