అధ్వానంగా రహదారులు
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:15 AM
గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుండాల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని సీతారాంపురం, వెల్మజాల, బ్రాహ్మణపల్లి, గుండాల, బండకొత్తపల్లి గ్రామాల మధ్య రోడ్లు దెబ్బతిని గుంతలుగా ఏర్పడ్డాయి. దీంతో కంకర తేలి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాదారులు ప్రయాణం చేయలేని పరిస్థితి. మండల కేంద్రానికి చేరాలంటే వెల్మజాల గ్రామస్థులు జంకుతున్నారన్నారు. అనంతారం, సుద్దాల మీదుగా గుండాలకు వెళితే అదనంగా 8 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు మరమ్మతులు చేపట్టే విధంగా కృషి చేస్తానన్నారు.
కంకర తేలడంతో ఇబ్బందులు
వల్లాల లింగస్వామి, బుర్జుబావి
వెల్మజాల- సీతారాంపురం గ్రామాల మధ్య రోడ్డు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కంకర తేలి గుంతల మయంగా ఉండడంతో అనంతారం -సుద్దాల మీదుగా గుండాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో అదనంగా దూరం పెరగడంతో పాటు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి.