Share News

గడ్డం మాదిరి.. బొగ్గు రాసుకుంటేనే హాజరు

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:02 AM

వీబీ జీరాంజీ పథకంలో హాజరు కూలీలకు ఇబ్బందిగా మారింది. ఫేస్‌ రికగ్నైజేషన హాజరు ప్రక్రియ నేపథ్యంలో మొదట తీసుకున్న ఫొటో ఆధారంగానే హాజరుకు యాప్‌ అంగీకరిస్తోంది.

 గడ్డం మాదిరి.. బొగ్గు రాసుకుంటేనే హాజరు
గడ్డం కోసం నల్లటి బొగ్గును పూసుకుంటున్న వెంకటేష్‌

(ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్‌)

వీబీ జీరాంజీ పథకంలో హాజరు కూలీలకు ఇబ్బందిగా మారింది. ఫేస్‌ రికగ్నైజేషన హాజరు ప్రక్రియ నేపథ్యంలో మొదట తీసుకున్న ఫొటో ఆధారంగానే హాజరుకు యాప్‌ అంగీకరిస్తోంది. దీంతో కూలీలకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం బొప్పారం గ్రామంలో ఉపాధి కూలీ ఎడ్ల వెంకటేష్‌ ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు. ఉపాధిహామీ పథకం ఫేస్‌ రికగ్నైజేషన నమోదు సమయంలో గడ్డంతో ఫొటో తీసుకున్నారు. ఈ క్రమంలో గడ్డం గీయించుకుని ఉపాధి పనికి వెళ్లాడు. పని పూర్తయ్యాక మేట్‌ యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ కోసం కూలీలు ఫొటోలు తీస్తుండగా వెంకటేష్‌ ఫొటో అప్‌లోడ్‌ కావడం లేదు. దీంతో పలుమార్లు ప్రయత్నించినా అప్‌లోడ్‌ కాలేదు. దీంతో ఫేస్‌ రికగ్నైజేషన సమయంలో ఉన్న మాదిరి గడ్డం ఉంటేనే ఫొటో తీసుకుంటుందన్న విషయం గ్రహించారు. వెంటనే బొగ్గు తీసుకుని గదమ చుట్టూ గడ్డం మాదిరి బొగ్గుతో గీసుకోవడంతో ఫొటో యాప్‌లో అప్‌లోడ్‌ అయినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లింగనాయక్‌ తెలిపారు. ఎనఎంఎంఎ్‌స యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొటున్నామని ఉపాధిహామీ కూలీలు వెల్లడించారు.

Updated Date - Jul 04 , 2026 | 12:02 AM