నివేదికను నీరుగార్చేయత్నం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:40 AM
రాష్ట్రంలో సంచలనం రేపిన ఽధాన్యం కేసు నీరుగార్చే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన అధికారులు, పోలీసులు.. రాజకీయనేతలు, సంఘాల నేతల ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుగార్చడం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
కీలకనేతల నుంచి ఉన్నతాధికారులు, పోలీసులపై ఒత్తిళ్లు
2024-25 యాసంగి ధాన్యం నిల్వలపైనా సందేహాలు
పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించి రికవరీ చేపట్టాలనే డిమాండ్లు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): రాష్ట్రంలో సంచలనం రేపిన ఽధాన్యం కేసు నీరుగార్చే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సిన అధికారులు, పోలీసులు.. రాజకీయనేతలు, సంఘాల నేతల ఒత్తిళ్లకు లొంగి కేసును నీరుగార్చడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. యాసంగి (2022-23) సీజన్‌కు సంబంధించి కేసులు నమోదైన మిల్లుల్లో ధాన్యం నిల్వల పై ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించి మూడురోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఉన్నతాధికారుల కు నివేదిక ఇవ్వకుండా ఒత్తి ళ్లు పనిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ధాన్యానికి సంబంధించి మొత్తం కేసు తీవ్రత తగ్గిస్తూ, కేసులు నమో దు కాని, ధాన్యం షార్టేజీ వచ్చిన ఇతర మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసే పరిస్థితి కనిపిస్తోందనే విమర్శలు వ స్తున్నాయి.
నివేదికను తొక్కిపెట్టేలా ఒత్తిళ్లు
కేసులు నమోదైన మిల్లుల్లో పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, కార్పొరేషన్ టెక్నికల్ అసిస్టెంట్లు, స్థానిక తహసీల్దార్లు ధాన్యం నిల్వల ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ వెరిఫికేషన్‌లో నిల్వల్లో రికార్డుల్లో ఉన్నవాటికి, భౌతికంగా తేడాలున్నట్లు గుర్తించిన బృందాలు ఆ విషయాన్ని నమోదు చేశాయి. అయితే సం బంధిత నివేదికను అధికారికంగా జిల్లా ఉన్నతాధికారులకు ఇవ్వకుండా తా త్సారం చేయించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ నివేది క ఉన్నది ఉన్నట్లు ఉన్నతాధికారులకు చేరితే కేసు తీవ్రత పెరిగే అవకాశముంటుందని, ఒత్తిళ్లకు లొంగి నివేదికను తారుమారు చేస్తే కేసు తేలిపోయే పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నా యి. ఈ కేసును నీరుగార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా నివేదిక ఇచ్చేలా తనిఖీ బృందాలను ఆదేశించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇదే సమయంలో జిల్లాలోని రెండు మిల్లుల్లో 2024-25 యాసంగి సీజన్‌కు సంబంధించిన సుమారు 280 ఏసీకేల ధాన్యం మాయమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే 2022-23 యాసంగికి సంబంధించి ధాన్యం రికవరీకి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరోవైపు మళ్లీ అదేరీతిలో ధాన్యం మాయమవడంపై ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకోకపోతే ప్రతిష్టాత్మకంగా భావించే ఽధాన్యం కొనుగోలు వ్యవహారం కాస్తా అబాసుపాలయ్యే ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వెల్లడవుతోంది. కీలక రాజకీయనేతలు, ఉన్నతాధికారులు ప్రభుత్వ ధాన్యం కాజేసిన వ్యాపారులకు వత్తాసు పలకవద్దని, ధాన్యం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తతతో వ్యవహరించి కేసును పారదర్శకంగా విచారించి నిందితుల నుంచి ధాన్యం రికవరీ చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి.