Share News

యువతకు ఉపాధి కల్పనకే ఏటీసీలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:26 AM

నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే రూ.46 కోట్లతో అడ్వాన్స టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని ఫణిగిరిగుట్ట వద్ద ఏటీసీని సందర్శించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

యువతకు ఉపాధి కల్పనకే ఏటీసీలు
ఏటీసీలో విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే రూ.46 కోట్లతో అడ్వాన్స టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని ఫణిగిరిగుట్ట వద్ద ఏటీసీని సందర్శించి, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఈ కేంద్రాన్ని టాటా కంపెనీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిందని, ఇందులో ప్రసుత్తం 172 మంది విద్యార్థులు వివిధ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన వారు స్వతహా ఉపాధి పొందడంతో పాటు ఉద్యోగాలను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతీ విద్యార్థికి రూ.2 వేలు చొప్పున ఉపకార వేతనాలు ఇస్తామని, ఆర్వో ప్లాంట్‌, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రూ.14కోట్లతో ఐటీఐ భవనం కూడా నిర్మిస్తున్నామని, అక్కడ బేసిక్‌ శిక్షణ, ఏసీటీలో టెక్నాలజీపై శిక్షణ ఇస్తారన్నారు. ఐటీఐ సకాలంలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహ, మునిసిపల్‌ చైర్మన, వైస్‌చైర్మన్లు శ్రీనివాస్‌, మల్లిఖార్జునరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన రాధిక, ప్రిన్సిపాల్‌ శ్రీరాములు, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 12:26 AM