Share News

శరవేగంగా..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:30 AM

వచ్చే విద్యా సంవత్సరం ఆరంభమే లక్ష్యంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు 10 స్కూళ్లు మంజూరు కాగా, ఒకటి రెండు మినహా మిగతా చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి.

శరవేగంగా..

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణాలకు జూన్‌ టార్గెట్‌

నల్లగొండలో 80 శాతంపైగా పూర్తయిన పనులు

గడ్డిపల్లి, సీతారాంపురం స్కూళ్ల ను జూన్‌నాటికి పూర్తిచేసే లక్ష్యం

ఆలేరు నియోజకవర్గం రాంపూర్‌ లో వేగవంతంగా సాగుతోన్న పనులు

కడపర్తి, ఊట్కూరు, కుందలపాడు, లక్ష్మీదేవిగూడెం, తొండలలో ఊపందుకున్న నిర్మాణాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): వచ్చే విద్యా సంవత్సరం ఆరంభమే లక్ష్యంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాలు చకచకా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు 10 స్కూళ్లు మంజూరు కాగా, ఒకటి రెండు మినహా మిగతా చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. నల్లగొండ, హుజూర్‌నగ ర్‌ నియోజకవర్గాల్లో నిర్మించే ఈ స్కూళ్ల పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పలుమార్లు సమీక్షలు సైతం నిర్వహించారు. దీంతో పను ల్లో వేగం ఊపందుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండి యా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా తొలిదశలో నిర్మాణం చేపట్టిన 68 స్కూళ్లల్లో వచ్చే విద్యాసంవత్సరం 2027-28 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉమ్మ డి జిల్లాలోనూ యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాల కోసం 12 నియోజకవర్గాలకు సూర్యాపేట, భువనగిరి మినహా 10చోట్ల స్కూళ్లను మంజూరు చేసింది. సూర్యాపేట, భువనగిరి నియోజకవర్గాల్లో స్కూళ్ల మంజూరుకు ఇటీవలే ప్రతిపాదనలు పంపినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్మాణాలు చేపట్టిన స్కూళ్లలో నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్మిస్తోన్న స్కూల్‌ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతూ, వచ్చే మే నాటికి స్కూల్‌ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు మంజూరైన గడ్డిపల్లి, సీతారాంపురం స్కూళ్లను సైతం వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలోపు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

నల్లగొండలో వచ్చే విద్యాసంవత్సరానికి యంగ్‌ ఇండియా స్కూల్‌ రెడీ

నల్లగొండ జిల్లాకేంద్రంలో గంధంవారిగూడెం వద్ద నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొ ని శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే ముందే ఇక్కడ స్థల సేకర ణ, టెండర్‌ ప్రక్రియ పూర్తిచేయడంతో పాటు, పనులు కూడా అదేస్థాయిలో వేగవంతంగా చేసేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. అన్ని బ్లాకుల నిర్మాణాలు ప్రస్తుతం శ్లాబ్‌, గోడల దశ దాటి చివరిదశలో ఉన్నాయి. మంత్రి స్వయంగా ఈస్కూల్‌ నిర్మాణ పనులను తరచూ సమీక్షిస్తుండడంతోపాటు పనులకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడంతో పనులు పూర్తికావొచ్చాయని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ స్కూల్‌ భవనాలు వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంనాటికి అందుబాటులోకి వస్తాయని, వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఈ స్కూల్‌లో తరగతులు ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

గడ్డిపల్లి, సీతారాంపురం పాఠశాలలు..

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి మంజూరైన యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ని గరిడేపల్లి మండ లం గడ్డిపల్లిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ పనులు మందకొడిగా సాగుతున్న సందర్భంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఈ పనుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పనులు కొనసాగించడంలో జాప్యం చేయవద్దని, వేగవంతంగా పనులు కొనసాగించాలని ఏజెన్సీకి, ఇంజనీర్లకు హెచ్చరించారు. దీంతో 2027-28 విద్యాసంవత్స రం నుంచి ఈ స్కూల్‌లో విద్యాబోధన సాగాల ని, ఈలోగా అంటే 2027 మేనెలాఖరులోగా ఇక్కడ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. దీంతో ఇటీవల ఇక్కడ పనుల్లో వేగం మొదలైం ది. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరైన యంగ్‌ ఇండియా స్కూల్‌ కోసం చిలుకూ రు మండలంలోని సీతారాంపురంలో 22ఎకరా ల స్థలాన్ని ఎంపికచేసి శంకుస్థాపనచేశారు. అయితే ఇక్కడకు వెళ్లేందుకు, నిర్మాణ సామగ్రి తరలించేందుకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ స్కూల్‌కు ప్రత్యేకంగా రూ.10కోట్లతో డబల్‌రోడ్డును మంజూరు చేయించి పనులను వేగవంతంగా పూర్తిచేయించి, ఆ రోడ్డును అం దుబాటులోకి తెచ్చారు. దీంతో ఇక్కడ నిర్మాణ.. సంస్థ సామగ్రిని తరలించి స్కూల్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ స్కూల్‌ను సైతం వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

మునుగోడు(లక్ష్మీదేవిగూడెం), తొండలో కొనసాగుతోన్న నిర్మాణాలు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెం వద్ద యంగ్‌ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ను నిర్మిస్తున్నారు. నిర్మాణసంస్థ అక్కడ చదును చేసే పనులు, పునాదుల నిర్మాణాలు పూర్తిచేసింది. తాజాగా అక్కడ పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తొండ గ్రామంలో నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు శంకుస్థాపనచేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. 18 నెలల్లోనే పనులు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ భూమి చదును పనులు పూర్తవ్వగా, పునాదుల పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మునుగోడు, తు టంగతుర్తి నియోజకవర్గాలకు కేటాయించిన ఈ స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి రావడం కష్టమేనని, 2027 డిసెంబరు వరకు నిర్మాణ పనులు కొనసాగే పరిస్థితి కొనసాగుతోంది.

నకిరేకల్‌లో ఊపందుకున్న పనులు

నకిరేకల్‌ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణంకోసం నకిరేకల్‌-కడపర్తి మధ్యలో కడపర్తి రెవెన్యూ శివారులో 20 ఎకరాల స్థలాన్ని ఎంపికచేసి కేటాయించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఈ స్కూల్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ, ఈ స్కూల్‌ నిర్మాణం వేగంగా పూర్తి చేయించాలని ప్ర భుత్వవిప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేకంగా దృష్టిసారించిన నేపథ్యంలో కా ంట్రాక్ట్‌ ఏజెన్సీ అంతకు ముందు నుంచే నిర్మాణ పనులు చేపట్టారు. పూర్తిగా మట్టిగుట్టలుండడంతో చదును చేసిన తర్వాత పునాదుల తవ్వకాలు పూర్తిచేశారు. ప్రస్తుతంపిల్లర్ల నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఆలేరు నియోజకవర్గంలో వేగంగా సాగుతోన్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి మంజూరైన స్కూల్‌కు తుర్కపల్లి మండలం రాంపూర్‌తండా సర్వేనెంబర్‌ 92లో 20ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2025, జూన్‌ 6న సీఎం రేవంత్‌రెడ్డి ఈ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. రాళ్లు, రప్పలతో నిండిన ఈ స్థలంలో రాళ్లను తొలగించారు. ప్రస్తుతం పిల్లర్ల పనులు పూర్తికాగా, బ్లాక్‌ల నిర్మాణాలు చేపట్టారు. ఈ స్కూల్‌ 2027-28 నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

నాగార్జునసాగర్‌, దేవరకొండల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులు..

నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ఇక్కడ చదును పనులు పూర్తవగా, పిల్లర్ల నిర్మాణాలు చేపట్టారు. వీలైనంత వేగంగా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఏజెన్సీతో పనులు చేయిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను కొండమల్లేపల్లి మండలం కుందలపాడు వద్ద నిర్మిస్తున్నారు. ఇక్కడ పిల్లర్ల నిర్మాణాల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ స్కూల్‌ను వీలైనంత వేగంగా పూర్తిచేయించాలనే లక్ష్యంతో అధికారులు పనులపై ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా శంకుస్థాపనచేశారు. తొలుత మండలంలోని వెంకటాద్రిపాలెం వద్ద ఎంపిక చేసిన స్థలం సరిపోను లేకపోవడంతో తాజాగా జప్తివీరప్పగూడెం శివార్లలో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ స్థలాన్ని కేటాయించేందుకు ఇటీవలే కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఈప్రాంతాన్ని పరిశీలించారు. స్థల కేటాయింపు పూర్తయితే ఇక్కడ పనులు మొదలుపెట్టాల్సి ఉంది.

Updated Date - Oct 12 , 2026 | 12:30 AM