అసత్య ప్రచారం మాని.. హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:26 AM
సీఎం రేవంతరెడ్డి కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మాని..మన రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నర్సింహ
భూదానపోచంపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంతరెడ్డి కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మాని..మన రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాధనంతో కేరళ రాష్ట్రంలో అసత్య ప్రచారం చేస్తూ మలయాళ పత్రికల్లో కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వానికి ‘నక్కకు నాకలోకానికి’ ఉన్నంత తేడా ఉందని అన్నారు. మనరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నేటికీ అమలు కాలేదని, నెలకు రూ. 4వేలు పింఛన హామీ నెరవేర్చలేదని, రైతు భరోసా ఐదు విడతల్లో ఇవ్వాల్సి ఉండగా మూడు దఫాలు ఎగ్గొట్టారని అన్నారు. సమావేశంలో సీపీఎం సీనియర్ నాయకుడు గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, నాయకులు కంజర్ల అశోక్, మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, అందెల జ్యోతి, పత్తి భిక్షపతి, పగిల్ల గంగారెడ్డి, మల్లారెడ్డి, బాత్క భిక్షపతి, కాగు నర్సింహ పాల్గొన్నారు.